RC15: శంకర్, దిల్ రాజుల అదృష్టం, ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-03-20T16:47:33+05:30 IST

అదేమీ ఇండోర్ అంటే స్టూడియోలో వేసిన సెట్ కాదు, ఓపెన్ ఎయిర్ లో వేసిన సెట్. మరి వర్షం వస్తే, షూటింగ్ ఆగిపోవలసిందే. కానీ వర్షం పడుతున్నా దిల్ రాజు, రామ్ చరణ్, శంకర్ ల సినిమా పాట షూటింగ్ ఎక్కడా ఆగకుండా చేస్తున్నారు, ఎలా?

RC15: శంకర్, దిల్ రాజుల అదృష్టం, ఎందుకంటే...
Ram Charan and Shankar discussing about a scene before shooting for their upcoming film

రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar Shanmugham) కాంబినేషన్ లో వస్తున్న సినిమా శరవేగంగా పూర్తి కావస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ పాన్ ఇండియా సినిమాకి నిర్మాత. ఇందులో కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali) కథానాయకులు. ఇది ఒక పొలిటికల్ డ్రామా అని అంటున్నారు, ఇందులో రామ్ చరణ్ సీఈఓ (చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్) గా వేస్తున్నాడు. సినిమా టైటిల్ ప్రస్తుతానికి #RC15 అని అంటున్నా, సీఈఓ (CEO Chief Electoral Officer)) అనే టైటిల్ పెట్టొచ్చు అని వార్తలు వస్తున్నాయి.

RC15.jpg

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఒక ప్రత్యేకమయిన సెట్లో ఈ సినిమాకి సంబదించిన ఒక పాట చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలిసింది. శంకర్ (#RC15) తనదయిన స్టైల్ లో ఈ పాటను చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే, ఈ సెట్ హైదరాబాద్ శివార్లలో ఒకా కాళీ ప్రదేశం లో వేశారు. ఓపెన్ ఎయిర్ లో ఈ సెట్ వేయటం వలన, మరి వర్షం వస్తే ఆగిపోవాలి కదా! అదే దిల్ రాజు, శంకర్ ల అదృష్టం. ఎందుకంటే దిల్ రాజు చాలా కోట్లు ఖర్చు పెట్టి ఈ సెట్ వేయిస్తే, వర్షం కి షూటింగ్ ఆపెయ్యాలి కదా.

rc153.jpg

కానీ వీళ్ళ అదృష్టం, పగలు ఎక్కువగా వర్షం పడటం లేదు, ఒక్క రాత్రి పూట మాత్రమే వర్షం పడుతూ ఉంటడంతో షూటింగ్ కి అంతరాయం లేకుండా జరుగుతోంది అని అంటున్నారు. పగలు షూటింగ్ చేస్తున్నారు అప్పుడు వర్షం పడటం లేదు. రాత్రి వర్షం పడినా కూడా సెట్ స్ట్రాంగ్ గా ఉండటం తో ఏమీ పాడటం లేదు అందువల్ల షూటింగ్ కూడా సజావుగా సాగిపోతోంది, అదృష్టమే అని అంటున్నారు.

Updated Date - 2023-03-20T16:47:34+05:30 IST