ITRaids: సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ రైడ్స్ లో ఏమి దొరికాయో తెలిస్తే షాక్...

ABN , First Publish Date - 2023-04-24T15:12:37+05:30 IST

గత నాలుగు రోజుల నుండి మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ ల మీద ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాల్లో ఏమైనా దొరికాయా లేదా...

ITRaids: సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ రైడ్స్ లో ఏమి దొరికాయో తెలిస్తే షాక్...

కొన్ని రోజుల క్రితం దర్శకుడు సుకుమార్ (Sukumar) ఇంటి మీద, అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఆఫీస్ ల మీద ఆదాయపుపన్ను శాఖ అధికారులు (ITRaids) దాడులు చేసి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సోదాలు నిన్నటి సాయంత్రం వరకు జరిగినట్టుగా పరిశ్రమలో ఒక టాక్ వినపడింది. ఎందుకంటే ఈరోజు అంటే సోమవారం దర్శకుడు సుకుమార్, 'పుష్ప 2' (Pushpa 2) నిర్మాతలు అయిన మైత్రి మూవీస్ మేకర్స్ మీటింగ్ పెట్టుకొని 'పుష్ప 2' షూటింగ్ ఎప్పటి నుండి మొదలెట్టాలి అనే విషయం మీద చర్చించారు అని తెలిసింది.

mythrimoviemakers.jpg

ఇంతకీ గత మూడు నాలుగు రోజుల నుండి ఐటి అహీకారులు అన్నీ కూలంకషంగా పరిశీలించారని తెలిసింది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ ఈమధ్య పెద్ద పెద్ద సినిమాలు నిర్మాణం చెయ్యడం, అలాగే అందులో చాలా సినిమాలు ఘన విజయం సాధించటంతో వారి ఆఫీస్ ల మీద ఈ సోదాలు నిర్వహించారు. అలాగే సుకుమార్ కూడా ఈమధ్యన #ITRaids కొన్ని సినిమాలు నిర్మాణం చెయ్యడం, అగ్ర దర్శకుల్లో ఒకడు అయి, చాలా పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకోవటం #ITRaids లాంటివి ఉండటం చేత, అతని ఇంటి మీద కూడా ఈ దాడులు నిర్వహించారు.

ఇంతకీ ఐటి అధికారులకి ఏమైనా దొరికాయా అంటే, ఏమి దొరకలేదు అని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ లో సభ్యులు విదేశాల్లో చాలా కాలం వుండి ఇక్కడికి వచ్చారు, అలాగే విదేశాలకి ఎక్కువగా వెళుతూ వుంటారు కూడా. అందుకనే వాళ్ళ మీద దాడులు చేసి, పరిశీలించారు కానీ, అందులో ఏమి దొరకలేదు అని తెలిసింది. అలాగే సుకుమార్ ఇంట్లో, ఆఫీస్ ల మీద కూడా చేసిన దాడిలో ఏమీ అనుమానాస్పదంగా లేవని పరిశీలనలో తేలినట్టు తెలిసింది.

allu-sukumar.jpg

ఈ దాడుల వలన అల్లు అర్జున్ #AlluArjun నటిస్తున్న 'పుష్ప 2' #Pushpa2 షూటింగ్ పోస్టుపోన్ అయింది. ఇప్పుడు మళ్ళీ మే మొదటి వారం లో కానీ, రెండో వారం నుండి కానీ షూటింగ్ ఉండవచ్చు అని తెలిసింది. ఆ విషయం ఈరోజు మీటింగ్ లో డిసైడ్ అవుతుంది అని తెలిసింది. అలాగే ఇప్పుడు జరగబోయే షూటింగ్ కూడా మారేడుమిల్లి #Maredumilli లో జరుగుతుందని, అక్కడికి యూనిట్ అంత వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నారని కూడా తెలిసింది.

Updated Date - 2023-04-24T15:12:37+05:30 IST