Dheekshith Shetty: ‘దసరా’ యాక్టర్‌కి తెలుగులో మరో ధమాకా ఆఫర్

ABN , First Publish Date - 2023-11-15T20:55:52+05:30 IST

దసరా సినిమాలో నాని స్నేహితుడి పాత్రలో నానితో స‌మానంగా నటించిన రక‌న్న‌డ న‌టుడు హీరో దీక్షిత్ శెట్టి జాత‌కం ట‌ర్న్ అయినట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో సూరి పాత్రలో త‌న న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆఫ‌ర్లు ఆయ‌న ఇంటి త‌లుపు తడుతున్నాయి.

Dheekshith Shetty: ‘దసరా’ యాక్టర్‌కి తెలుగులో మరో ధమాకా ఆఫర్
Dheekshith Shetty

దసరా సినిమాలో నాని స్నేహితుడి పాత్రలో నానితో స‌మానంగా నటించిన రక‌న్న‌డ న‌టుడు హీరో దీక్షిత్ శెట్టి(Dheekshith Shetty) జాత‌కం ట‌ర్న్ అయినట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో సూరి పాత్రలో త‌న న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా విడుద‌లై సంవ‌త్స‌రం అవుతుండ‌గా ఇప్పుడు ఆఫ‌ర్లు ఆయ‌న ఇంటి త‌లుపు తడుతున్నాయి. తాను చేసిన నటన తెలుగు ప్రేక్షకులను అలరించింది.

ఇప్ప‌టికే దీక్షిత్‌ క‌న్న‌డ‌నాట వ‌రుస‌బెట్టి స‌నిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 'దసరా'తో తెలుగులో మంచి గుర్తింపు రావ‌డంతో అతను నటించిన‌ కన్నడ సినిమాలు తెలుగులో విడుదల చేసేందుకు ప‌లువురు నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌న్న‌డ‌లో చేసిన‌ 'బ్లింక్స్‌', 'కేటీఎమ్' 'కల్యాణ ప్రాప్తిరస్తు' సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. త్వ‌ర‌లో అవి తెలుగులోనూ వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది.


ఇదిలాఉండ‌గా తాజాగా దీక్షిత్ శెట్టి మరో స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ద్వారా కిలారు ప్రేమ్ చంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అడ్వెంచర్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది.

Updated Date - 2023-11-15T20:55:53+05:30 IST