సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dharmavarapu Subramanyam Son : మరణం గురించి నాన్నకు ముందే తెలుసు!

ABN, First Publish Date - 2023-04-24T16:25:39+05:30

మేం అసలే లెక్కల్లో వీక్‌ బాబూ.. నీది తెనాలే.. మాది తెనాలే.. ఆకాశం నీలిరంగులో ఉంది... ఇలాంటి పేస్ట్‌ ఉన్న ఊళ్లో ఎందుకు దొరకదు... బ్రదరూ.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నోట పలికిన ఈ డైలాగులివి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేం అసలే లెక్కల్లో వీక్‌ బాబూ..

నీది తెనాలే.. మాది తెనాలే..

ఆకాశం నీలిరంగులో ఉంది...

ఇలాంటి పేస్ట్‌ ఉన్న ఊళ్లో ఎందుకు దొరకదు... బ్రదరూ..

ధర్మవరపు సుబ్రహ్మణ్యం నోట పలికిన ఈ డైలాగులివి. (Dharmavarapu Subramanyam)

సినీ అభిమానులకు ఆయన దూరమై పదేళ్లు కావొస్తుంది. అయినా ఆయన నటన, హాస్యం (tollywood comedian) ఇప్పటికీ ప్రేక్షకులు మదిలో చెరగని ముద్ర వేశాయి. 2013లో లివర్‌ క్యాన్సర్‌తో మరణించిన ఆయన గురించి ధర్మవరపు కుమారుడు రవి బ్రహ్మ తేజ.. (Ravi brahma teja) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘నాన్న మాకు కష్టం తెలియకుండా పెంచారు. ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేమిప్పటికీ సంతోషంగా ఉన్నాం. 2001లో ‘నువ్వు నేను’ సక్సెస్‌ పార్టీకి వెళ్లొస్తున్న సమయంలో ఆయనకు యాక్సిడెంట్‌ అయింది. బస్సు నాన్న కారు మీదకు ఎక్కింది. తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడున్నవాళ్లు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో బతికారు. తలపై 21 కుట్లు, కుడి చేతికి సర్జరీ చేసి రాడ్స్‌ వేశారు. ఆ తర్వాత 2005లో నాన్న ఉన్నట్లుండి అనారోగ్యానికి లోనయ్యారు. సిగరెట్‌కు బానిస కావడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయిని చెప్పారు. (Dharmavarapu Subramanyam)

పది రోజులు కోమాలో ఉన్నారు. అలా రెండు ప్రమాదాల నుంచి నాన్నను రాపాడుకున్నారు. కానీ మూడో ఏం చేయలేకపోయాం. 2012 దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం మరింత దెబ్బతింది. లివర్‌ క్యాన్సర్‌ నాలుగో స్టేజీ, 11 నెలలకు మించి బతకరని వైద్యులు చెప్పారు. నాన్న, బ్రహ్మానందంగారు గొప్ప స్నేహితులు. తరచూ నాన్నకు ఫోన్‌ చేసి మాట్లాడేవారు. ‘ఒక్కసారి చూడాలనుందిరా ఇంటికి వచ్చి చూస్తానంటే నాన్న ఒప్పుకునేవాడు కాదు. నన్ను చూేస్త తట్టుకోలేవు, ఆరు నెలలు ఆగు నేనే వస్తా... మళ్లీ కలిసి షూటింగ్‌ చేద్దాం అన్నారు. కానీ అంతలోనే మరణించారు. నాన్నకు ముందే తెలుసు మరణం దగ్గర్లోనే ఉందని’’ ఆయన మరణాన్ని మాతోపాటు బ్రహ్మానందంగారు తట్టుకోలేకపోయారు’’ అని అన్నారు.

Updated Date - 2023-04-24T16:25:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!