శ్రీలీల వదిలిన రామబాణం పాట

ABN , First Publish Date - 2023-04-25T00:07:30+05:30 IST

గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘రామబాణం’. ఈ చిత్రంలోని థర్డ్‌ సింగిల్‌ లిరికల్‌ వీడియోను ‘ధమాకా’ హీరోయిన్‌ శ్రీలీల సోమవారం విడుదల చేశారు.

శ్రీలీల వదిలిన రామబాణం పాట

గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘రామబాణం’. ఈ చిత్రంలోని థర్డ్‌ సింగిల్‌ లిరికల్‌ వీడియోను ‘ధమాకా’ హీరోయిన్‌ శ్రీలీల సోమవారం విడుదల చేశారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్‌ ఈ పాటను మెస్మరైజింగ్‌ ట్రాక్‌గా కంపోజ్‌ చేశారు. తను ఇష్టపడే అమ్మాయి అందంపై హీరో ప్రశంసలు కురిపిస్తూ పాడే ఈ పాటను శ్రీమణి రాశారు. కోల్‌కతా నేపథ్యంలో వచ్చే ఈ పాటలో విజువల్స్‌ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. గోపీచంద్‌, డింపుల్‌ హయతి ఈ పాటలో చాలా అందంగా కనిపించారు. దినే్‌షకుమార్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత.

Updated Date - 2023-04-25T00:12:36+05:30 IST