Devil : అంతు చిక్కని రహస్యం కోసం 

ABN , First Publish Date - 2023-12-07T18:52:28+05:30 IST

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ Ṭహీరోగా నటుస్తున్న  పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఇప్పటి వరకు విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది

Devil : అంతు చిక్కని రహస్యం కోసం 

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ Ṭహీరోగా నటుస్తున్న  పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఇప్పటి వరకు విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ లుక్ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జోనర్ మూవీ.. భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. దీంతో  సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ప్రేక్ష‌కులు, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌టం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నారు. 'డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది ‘డెవిల్’తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై  అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు.   డిసెంబర్ 29న వరల్డ్ వైడ్ గా  తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.  

Updated Date - 2023-12-07T19:00:42+05:30 IST