Devil: కల్యాణ్‌రామ్‌ ఎలా చేశాడు.. నెటిజన్ల కామెంట్స్‌! 

ABN , Publish Date - Dec 29 , 2023 | 11:04 AM

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్‌’. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ఫై అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. సంయుక్తా మీనన్‌, మాళవికా నాయర్‌ కథానాయికలు.  ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌తో ఒక్కసారిగా సినిమాకు  హైప్‌ తీసుకొచ్చింది.

Devil:  కల్యాణ్‌రామ్‌ ఎలా చేశాడు.. నెటిజన్ల కామెంట్స్‌! 

నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Kalyanram) హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్‌’. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ఫై అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. సంయుక్తా మీనన్‌, మాళవికా నాయర్‌ కథానాయికలు.  ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌తో ఒక్కసారిగా సినిమాకు  హైప్‌ తీసుకొచ్చింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. సినిమా చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. మరి డెవిల్‌ చిత్రం ఎలా ఉంది. బింబిసారతో భారీ విజయం అందుకున్న కల్యాణ్‌రామ్‌. అమిగోస్‌తో పరాజయాన్ని చవిచూశారు. మరి డెవిల్‌తో విజయాన్ని అందుకున్నారా? కల్యాణ్‌రాజ్‌ ఖాతాలో హిట్‌ పడిందా? అన్నది చూద్దాం. 

ఇందులో కల్యాణ్‌రామ్‌ బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించాడు. సినిమా ప్రారంభం నుంచి మంచి ఫ్లోలో ఉందని, స్క్రీన్ ప్లే  బాగుందని చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌ వన్‌మ్యాన్‌ షో అని చెబుతున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ ఓకే అనిపించినా మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రథమార్ధం యావరేజ్‌, సెకండాఫ్‌ డీసెకంట్‌గా ఉందని, అక్కడక్కడా పలు సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక బీజీఎం అదిరిపోయిందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ నెటిజన అయితే 2.75 రేటింగ్‌ ఇచ్చాడు. ఓవరాల్‌ కల్యాణ్‌రామ్‌ పాస్‌ అని, హిట్టు బొమ్మ అని  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


Updated Date - Dec 29 , 2023 | 11:19 AM