Ntr-Devara: అత్యంత ఖరీదైన షెడ్యూల్‌..

ABN , First Publish Date - 2023-06-09T11:01:06+05:30 IST

జూ. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ మిక్కిలినేని, కె హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకొంది. ఎండలు అధికం కావడంతో షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చారు. తాజాగా మూడో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

Ntr-Devara: అత్యంత ఖరీదైన షెడ్యూల్‌..

జూ. ఎన్టీఆర్‌ (Jr Ntr) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratasa shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ మిక్కిలినేని, కె హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకొంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు ప్రతినాయకుడిగా నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్‌ కూడా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఎండలు అధికం కావడంతో షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చారు. తాజాగా మూడో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కొరటావ శివ ప్రస్తుతం మాసీవ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ - సైఫ్‌ (Saif ali khan) అలీఖాన్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ జరిగిన షెడ్యూల్స్‌లో అత్యంత ఖరీదైన షెడ్యూల్‌ ఇదేనని మేకర్స్‌ చెబుతున్నారు. 20 రోజులపాటు ఈ షెడ్యూల్‌ జరగనుంది.

సముద్ర తీరం ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. తారక్‌ ఇందులో డ్యూయల్‌ రోల్‌లో కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ తారక్‌ సరసన కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 5, 2024న ఈ చిత్రం విడుదల కానుంది.

Updated Date - 2023-06-09T11:01:06+05:30 IST