Adipurush: అందరూ బాగోలేదు అంటున్నారు, నెగటివ్ ట్రోల్స్, కానీ కలెక్షన్ల సునామీ ఏంటిరా బాబూ

ABN , First Publish Date - 2023-06-17T09:45:10+05:30 IST

'ఆదిపురుష్' సినిమాకి వచ్చినన్ని నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ ఏ సినిమాకి రాలేదు ఈమధ్య కాలంలో. ప్రభాస్ రాముడిగా నటించిన, ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే షాకింగా వుంది

Adipurush: అందరూ బాగోలేదు అంటున్నారు, నెగటివ్ ట్రోల్స్, కానీ కలెక్షన్ల సునామీ ఏంటిరా బాబూ
Adipurush

ప్రభాస్ (Prabhas) తన స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించాడు. తను రాముడిగా నడిచిన 'ఆదిపురుష్' #Adipurush సినిమా నిన్న జూన్ 16న థియేటర్స్ లో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి ఆట నుండే ప్రేక్షకులు ఈ సినిమా మీద ట్రోల్స్ మొదలెట్టేసాడు. #AdipurushCollections అసలు ఏ సినిమాకి రానటువంటి నెగటివ్ కామెంట్స్ ఈ సినిమాకి చేశారు. ప్రేక్షకులు బయటకి వచ్చాక ఇదేమి రామాయణం, ఓం రౌత్ (OmRaut) ఎక్కడ చూసి తీసాడు అంటూ చాలా నిరాశ పడ్డారు.

Prabhas.jpg

ఒక్క సన్నివేశం కూడా బాగా తీయలేదు అంటూ విరుచుకు పడ్డారు. విఎఫ్ఎక్స్ (VFX) అసలు బాగోలేవని, అందులోకి రావణాసురిడి పాత్ర మరీ ఘోరంగా ఉందని కూడా కొంతమంది అన్నారు. ఈ సినిమా 'ప్లానెట్ అఫ్ ఏప్స్' (PlanetOfAps), 'కింగ్ కాంగ్' (KingKong) రెండు సినిమాల మిక్స్ అని ఇంకొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు #AdipurushReview ఈ సినిమాని విమర్శించినవారే ఎక్కువమంది వున్నారు.

ఇంత నెగటివ్ కామెంట్స్ వచ్చినా ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది అనే చెప్పాలి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్టు చేసిందని అంటున్నారు. ఇంతవరకు ఏ సినిమా కూడా మొదటి రోజు ఇంత కలెక్షన్స్ చెయ్యలేదని, ప్రభాస్ #Prabhas మరోసారి తన పవర్ ఏంటో చూపించాడు అని అంటున్నారు. #Adipurush ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్ (KritiSanon) సీతగా వేసింది. దేవదత్త నగె (DevadattaNage) హనుమంతుడిగా కనిపిస్తాడు, అలాగే సన్నీ సింగ్ (SunnySingh) లక్షణుడి పాత్రలో కనిపిస్తాడు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) వేసాడు.

Prabhas.jpg

మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ 69 కోట్లు కలెక్టు చేసిందని కొందరు చెపుతున్నారు. అయితే ఇంకా పూర్తి గణాంకాలు రావాల్సి వుంది. నిర్మాతలు కూడా అధికారికంగా ఎంత కలెక్టు చేసింది అనే విషయం ఇంకా చెప్పలేదు. ఏది ఏమైనా ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చిన మొదటి రోజు మాత్రం రికార్డుల వెల్లువగా 'ఆదిపురుష్' కలెక్షన్ల వర్షం కురుపించిందనే చెప్పాలి.

Updated Date - 2023-06-17T09:45:10+05:30 IST