Deenamma jeevitham: యానిమల్‌ లాంటి సినిమా!

ABN , Publish Date - Dec 30 , 2023 | 07:50 PM

దేవ్‌(Dev), ప్రియ చౌహాన్‌(priya chowhan), సరిత ప్రధాన పాత్రల్లో ‘ప్రేమ పిపాసి’ ఫేం మురళి రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దీనమ్మ జీవితం’ (Deenamma jeevitham) . వై. మురళి కృష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి.దివ్య సంతోషి, బి సోనియా నిర్మించారు.

Deenamma jeevitham:  యానిమల్‌ లాంటి సినిమా!

 

దేవ్‌(Dev), ప్రియ చౌహాన్‌(priya chowhan), సరిత ప్రధాన పాత్రల్లో ‘ప్రేమ పిపాసి’ ఫేం మురళి రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దీనమ్మ జీవితం’ (Deenamma jeevitham) . వై. మురళి కృష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి.దివ్య సంతోషి, బి సోనియా నిర్మించారు. జనవరి 5న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మురళి రామస్వామి మాట్లాడుతూ "నా తొలి చిత్రం ప్రేమపిపాసి’ ఎంతో కసిగా తీశా. ప్రేమని వెతుక్కునే కుర్రాడి కథతో తీసిన ఆ చిత్రానికి మంచి క్రేజ్‌ వచ్చింది. అర్జున్‌ రెడ్డిలా వుందని ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో కరోనా లాక్‌ డౌన్‌ వచ్చింది. అప్పుడే 'దీనమ్మ జీవితం’ అనిపించింది. అయితే నాకు తెలిసింది సినిమానే. ఎలాగైనా మళ్ళీ సినిమా చేయాలని సంకల్పించుకున్నాను. అప్పుడు ఈ చిత్రం చేశా. ‘దీనమ్మ జీవితం’. చాలా డిఫరెంట్‌ కంటెంట్‌తో తెరకెక్కింది.  ‘యానిమల్‌’ చిత్రం లాంటి రా ఫ్యామిలీ సినిమా ఇది’’ అని అన్నారు. హీరోహీరోయిన్లు సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 


Updated Date - Dec 30 , 2023 | 07:50 PM