ఆస్కార్‌ ప్రజెంటర్‌గా దీపిక

ABN , First Publish Date - 2023-03-04T00:28:57+05:30 IST

బాలీవుడ్‌ కథానాయిక దీపిక పదుకొణెకు అరుదైన అవకాశం దక్కింది. ఈనెల 12 జరగనున్న ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు....

ఆస్కార్‌ ప్రజెంటర్‌గా దీపిక

బాలీవుడ్‌ కథానాయిక దీపిక పదుకొణెకు అరుదైన అవకాశం దక్కింది. ఈనెల 12 జరగనున్న ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆస్కార్‌ కమిటీ నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. దీపికతో పాటుగా పదహారు మంది ప్రజెంటర్ల జాబితాను ఆస్కార్‌ ప్రకటించింది. ఇందులో చోటు సంపాదించుకొన్న ఏకైన భారతీయ నటి దీపిక కావడం విశేషం. ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రజెంటర్‌గానూ దీపిక వ్యవహరించారు. గతేడాది కేన్స్‌ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పుడు ఆస్కార్‌ నుంచి పిలుపు రావడం దీపిక క్రేజ్‌కు అద్దం పడుతుంది. ఈసారి ఆస్కార్‌లో మనదేశం ఆశలన్నీ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’పైనే ఉన్నాయి. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో నామినేషన్‌ పొందిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-03-04T00:28:58+05:30 IST