Dasara: ఓ ఇంటివాడు అవ్వబోతున్న 'దసరా' దర్శకుడు

ABN , First Publish Date - 2023-05-31T10:47:41+05:30 IST

'దసరా' సినిమాతో ఒక పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక ఇంటివాడు అవబోతున్నట్టుగా తెలిసింది. ఈరోజు కరీమ్ నగర్ లో అతని వివాహం జరగబోతున్నట్టుగా తెలిసింది. దీనికి అతని గురువు దర్శకుడు సుకుమార్ హాజరు అవుతున్నారని తెలిసింది.

Dasara: ఓ ఇంటివాడు అవ్వబోతున్న 'దసరా' దర్శకుడు
Srikanth Odela with Actor Nani

ఈమధ్యనే నాని (Nani) తో 'దసరా' (Dasara) అనే సినిమాతో ఒక మంచి హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (SrikathOdela). ఇది అతనికి దర్శకుడిగా మొదటి సినిమా. తెలంగాణ నేపధ్యం లో తీసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ (KeerthySuresh) కథానాయికగా నటించింది. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ను మంచి దర్శకుల జాబితాలో మొదటి సినిమాతోటే చేర్చింది.

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ 'దసరా' #Dasara సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఒక ఇంటివాడు అవబోతున్నట్టుగా తెలిసింది. ఈరోజు కరీమ్ నగర్ లో అతని వివాహం జరగనుందని తెలిసింది. ఈ వివాహం గురించి శ్రీకాంత్ హడావిడి లేకుండా తనకు బాగా పరిచయం వున్న వారిని మాత్రమే పిలిచాడని కూడా తెలిసింది.

Srikanth-Odela.jpg

శ్రీకాంత్ గురువు, అగ్ర దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ వివాహానికి హాజరు అవుతున్నట్టుగా తెలిసింది. అతను నిన్న మారేడుమిల్లి (Maredumilli) లో 'పుష్ప 2' #Pushpa2 షూటింగ్ ముగించుకొని అక్కడ నుండి నేరుగా కరీమ్ నగర్ కి ప్రయాణం అయినట్టుగా కూడా తెలిసింది. అలాగే 'దసరా' #Dasara సినిమాలో నటించిన నాని, కీర్తి సురేష్ (KeerthySuresh) లు కూడా ఈ వివాహానికి హాజరు అవుతున్నట్టుగా తెలిసింది.

అలాగే పరిశ్రమలో శ్రీకాంత్ స్నేహితులు, 'ఉప్పెన' #Uppena తో మంచి హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు సానా (BuchiBabuSana) కూడా హాజరు అవుతున్నట్టుగా తెలిసింది. అలాగే 'దసరా' సినిమా నిర్మాత, ఆ సినిమాకి పని చేసిన కొంతమంది యూనిట్ సభ్యులు కూడా హాజరు అవుతున్నట్టు తెలిసింది. అయితే అతను ఎవరిని చేసుకుంటున్నాడు అనే విషయాలు అన్నీ ఇంకా తెలియవలసి వుంది. ఎందుకంటే అతను సినిమా పరిశ్రమలో ఒక సినిమా దర్శకత్వం చేసిన తరువాతే వివాహం చేసుకుంటాను అని నిర్ణయించుకున్నాడని, అందుకనే 'దసరా' విడుదల అయి మంచి హిట్ అయింది, అందుకని ఇప్పుడు చేసుకుంటున్నట్టుగా కూడా తెలిసింది.

Updated Date - 2023-05-31T10:47:41+05:30 IST