సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Das Ka Dhamki Twitter Review: విష్వక్ సేన్ నటించిన సినిమా ఎలా ఉందంటే..?

ABN, First Publish Date - 2023-03-22T12:07:34+05:30

యంగ్ స్టార్ విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). నివేథా పేతురాజ్ (Nivtha Pethuraj) హీరోయిన్ పాత్రను పోషించారు. ఈ సినిమాకు విష్వకే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ స్టార్ విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). నివేథా పేతురాజ్ (Nivtha Pethuraj) హీరోయిన్ పాత్రను పోషించారు. ఈ సినిమాకు విష్వకే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో మార్చి 22న విడుదలైంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా తమ అభిప్రాయాలను ట్విటర్‌లో అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మరి చిత్రం ఏ విధంగా ఉందో తెలుసుకుందామా.

‘‘మీరు యాక్షన్ సినిమాల అభిమాని అయితే దాస్ కా ధమ్కీకి మీకు సరైన చిత్రం! ఈ బ్లాక్ బస్టర్ హిట్ సెకండాఫ్‌లో నాన్ స్టాప్ అడ్రినలిన్ రష్. ఇది మీ టిక్కెట్ ధరలో ప్రతి పైసాకు న్యాయం చేకూరుస్తుంది’’ అని ఓ నెటిజన్ తెలిపారు.

‘‘యాక్షన్ సీన్స్ బాగున్నాయి. విష్వక్ సేన్ అద్భుతంగా నటించారు’’ అని మరో నెటిజన్ చెప్పారు.

‘‘విష్వక్ సేన్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ ఉంది. డైలాగ్స్ ను చాలా కొత్తగా చెప్పారు’’ అని ఓ సోషల్ మీడియా పేర్కొన్నారు.

‘‘సినిమా మొత్తం ఎక్కడో చూసినట్టే ఉంది. కొంచెం కొత్తగా కూడా ఉంది. డైరెక్షన్‌ని బాగా ఉపయోగించుకున్నారు’’ అని మరో సోషల్ మీడియా యూజర్ తెలిపారు.

‘‘సినిమా స్ట్రిక్ట్‌గా యావరేజ్. ఫస్టాప్ ఓకే. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తం సైడ్ అయిపోయింది. ట్విస్ట్‌లు, స్క్రీన్ ప్లే బాగా లేవు’’ అని ఒకరు పోస్ట్ పెట్టారు.


Updated Date - 2023-03-22T12:56:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!