ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆస్కార్‌... ఉబ్బితబ్బిబైపోయాను

ABN , First Publish Date - 2023-03-13T11:14:24+05:30 IST

‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ వరించడం చాలా ఆనందంగా ఉందని డి.సురేశ్‌బాబు అన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో చూస్తున్న కీరవాణి, చంద్రబోస్‌లను ఆస్కార్‌ వేదికపై చూడగానే ఉబ్బితబ్బిబైపోయాను

ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆస్కార్‌... ఉబ్బితబ్బిబైపోయాను

‘నాటు నాటు’ (Natu natu)పాటకు ఆస్కార్‌ (Oscar 95) వరించడం చాలా ఆనందంగా ఉందని డి.సురేశ్‌బాబు అన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో చూస్తున్న కీరవాణి(Keeravavni- CHandrabose), చంద్రబోస్‌లను ఆస్కార్‌ వేదికపై చూడగానే ఉబ్బితబ్బిబైపోయాను అని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన స్పందించారు. ‘‘తెలుగు సినిమా అని కాదు.. ఇండియన్‌ సినిమాకు దక్కిన గౌరవమిది. ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు, బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్రం కూడా ఆస్కార్‌ అవార్డ్‌ అందుకోవడం అంటే రెండు ఇండియన్‌ సినిమాలు ఆస్కార్‌ వేదికపై మెరవడం రొమాలు నిక్కబోడిచినట్లు అనిపించింది. కీరవాణిగారు చక్రవర్తిగారి దగ్గర పని చేసినప్పటి నుంచి పరిచయం, తాజ్‌మహల్‌ చిత్రంతో చంద్రబోస్‌కి నాన్న బ్రేక్‌ ఇచ్చారు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి చూస్తున్న కీరవాణి, చంద్రబోస్‌లను ప్రపంచ స్థాయి వేదికపై చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఉప్పొంగిపోయాను. ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది. ఈ సినిమా వెనకున్న రాజమౌళి, సాంగ్‌ కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్‌రక్షిత్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అద్భుతమైన డాన్స్‌ అన్ని కలిసి ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకెళ్లాయి’’ అని అన్నారు. ’’ అని అన్నారు. (Sureshbabu wishes to RRR)

‘‘బాహుబలి’ అనేది రాజమౌళి చేసిన ధైర్యం. దాంతో వరల్డ్‌వైడ్‌ మార్కెట్‌ పెరిగింది. ఆ సినిమా తర్వాత కేజీఎఫ్‌, కాంతార చిత్రాలు వరుస కట్టాయి. ఇవన్నీ కూడా ప్రయత్నాలు, ప్రయోగాలు చేయడానికి ఓ స్ఫూర్తి లాంటివి. భవిష్యత్తు వచ్చే మేకర్స్ఇవన్నీ పునాదిలా ఉపయోగపడతాయి’’ అని సురేశ్‌బాబు చెప్పారు.

అలాగే అవార్డు అందుకున్న మరో చిత్రం ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ బృందాన్ని కూడా సురేశ్‌బాబు అభినందించారు. గునీత్‌ మోంగా 2007 నుంచి ఇండస్ట్రీలో ఉంది. పలు సందర్భాల్లో ఆమెను కలిశాను. చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఎదిగారు. ఓ మంచి కథతో నూతన దర్శకురాలిని పరిచయం చేసి ఆస్కార్‌ అందుకుంది

Updated Date - 2023-03-13T11:29:44+05:30 IST