సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Naga Chaitanya: లేట్‌ అవ్వచ్చు.. కానీ కచ్చితంగా గెలుపు ఉంటుంది!

ABN, First Publish Date - 2023-05-05T19:35:08+05:30

అక్కినేని నాగ చైతన్య(Naga chaitanya), కృతీశెట్టి(Krithi shetty) జంటగా వెంకట ప్రభు దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘కస్టడీ’ (Custody) .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగ చైతన్య(Naga chaitanya), కృతీశెట్టి(Krithi shetty) జంటగా వెంకట ప్రభు దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘కస్టడీ’ (Custody) . ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో, విలన్‌ని రక్షించడం, అతనిని చనిపోనివ్వకుండా చేయడం అన్న కథాంశం యూనిక్‌గా, ఉత్కంఠభరితంగా ఉంది. ఇందులో నాగచైతన్య చట్టానికి కట్టుబడి ఉండే పోలీస్‌గా కనిపించారు. అతని ప్రేమ సమస్యలో ఉన్నట్లు, మనసు పడిన అమ్మాయిని వేరే అబ్బాయికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తున్నట్లు చూపించారు. అదే సమయంలో ఒక నేరస్థుడిని కోర్టు ముందు హాజరుపరిచే వరకూ తన ప్రత్యర్థుల నుంచి కాపాడాల్సిన బాధ్యత హీరోపై ఉంది. అటు ప్రేయసి, ఇటు వృత్తి ధర్మం.. చివరికి ఏం చేశాడనేది ఇతివృత్తం. యాక్షన్‌ ప్యాక్డ్‌ సినిమాగా రూపొందినట్లు ట్రైలర్‌లో చూపించారు.

‘‘ఒకసారి న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది..

నిజం గెలవడానికి లేట్‌ అవుతుంది.. కానీ కచ్చితంగా గెలుస్తుంది’’

అని హీరోగా చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నా. శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతినాయకుడిగా అరవింద్‌ స్వామి పాత్ర ఆకట్టుకునేలా ఉంది. ప్రియామణి, సంపత్‌రాజ్‌ కీలక పాత్రలో నటించారు.

Updated Date - 2023-05-05T19:35:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!