యాక్షన్‌తో గం గం గణేశా

ABN , First Publish Date - 2023-09-16T00:33:47+05:30 IST

‘బేబి’ చిత్రంతో రీసెంట్‌గా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న హీరో ఆనంద్‌ దేవరకొండ తాజా చిత్రం ‘గం గం గణేశా’.....

యాక్షన్‌తో గం గం గణేశా

‘బేబి’ చిత్రంతో రీసెంట్‌గా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న హీరో ఆనంద్‌ దేవరకొండ తాజా చిత్రం ‘గం గం గణేశా’. ఇప్పటివరకూ తను చేయని యాక్షన్‌ జోనర్‌లో ఆనంద్‌ ఈ సినిమా చేస్తున్నారు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘గం గం గణేశా’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శివ నిర్వాణ, అనుదీప్‌ కేవీ, కార్తీక్‌ దండు, వినోద్‌ అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ ‘టీజర్‌ ఎంత ఎనర్జిటిక్‌గా ఉందో, యాక్షన్‌, కామెడీ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. సినిమా మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. వినాయకచవితికి చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నాం కానీ కుదరక పోవడంతో సంవత్సరాంతంలో రిలీజ్‌ చేస్తాం’ అని తెలిపారు.

‘జీవితంలో మనకు ఏదో సందర్భంలో క్రేజీ క్యారెక్టర్స్‌ ఎదురు వడుతుంటాయి. వినాయకచవితి చుట్టూ తిరిగే కథ. పండగను మనమంతా కలసి సెలబ్రేట్‌ చేసుకున్నట్లే ఈ సినిమాను కూడా ఎంజాయ్‌ చేస్తారు’ అని దర్శకుడు ఉదయ్‌ శెట్టి చెప్పారు.

ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘కొత్త దర్శకుడు, నిర్మాతలతో పని చేస్తున్నా. క్రైమ్‌, యాక్షన్‌ అంశాలతో మిమ్మల్ని ఆకట్టుకొనే మూవీ ఇది. హీరోగా నాకు ఇది ఆరో సినిమా. భయం, అత్యాశ, కుట్ర అంశాల చుట్టూ కథ తిరుగుతుంటుంది. నా గత చిత్రాలతో పోలిస్తే చాలా డిపరెంట్‌ మూవీ ఇది’ అని చెప్పారు.

Updated Date - 2023-09-16T00:33:47+05:30 IST