KritiSanon: సీత పాత్రకి సరిపోతుందా, తెలుగు సీతకి ఈమెకి అస్సలు పొంతన లేదు

ABN , First Publish Date - 2023-04-29T16:12:10+05:30 IST

కృతి సనన్ సీత గా చేసిన మొదటి లుక్ ఈరోజు విడుదల చేశారు. అయితే ఆమె పాత్రధారణ, తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు అని, ఎందుకంటే...

KritiSanon: సీత పాత్రకి సరిపోతుందా, తెలుగు సీతకి ఈమెకి అస్సలు పొంతన లేదు
Kriti Sanon

తింటే గారెలే తినాలి, చూస్తే తెలుగు పౌరాణిక సినిమాలే చూడాలి, అంటే అంతగా తెలుగువారు నిర్మించినట్టుగా పౌరాణిక సినిమాలు ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ బహుశా తీయలేదేమో. సినిమా చూస్తున్నంత సేపూ, ప్రేక్షకుడు ఆ పాత్రనే చూస్తాడు తప్ప, అందులోని నటుడిని కాదు అన్నంతగా తీశారు తెలుగు నిర్మాతలు, దర్శకులు ఈ పౌరాణిక సినిమాలు.

kritisanonSita.jpg

అయితే ఇదంతా ఎందుకు అంటే, ఇప్పుడు ప్రభాస్ #Prabhas, కృతి సనన్ #KritiSanon జంటగా 'ఆదిపురుష్' #Adipurush అనే సినిమా రామాయణం ఆధారంగా ఒక యానిమేషన్ సినిమా వస్తోంది. ఇందులో రాముడిగా #LordRama ప్రభాస్, #GoddessSita సీత గా కృతి సనన్ వేశారు. ఈరోజు అంటే శనివారం, కృతి సనన్ సీత పాత్ర ఫోటో విడుదల చేశారు. అయితే ఈ పాత్రకి కృతి సనన్ సరిపోతుందా, సరిపోదా అని పక్కన పెడితే, తెలుగు సీతకి మాత్రం ఎట్టి పరిస్థుల్లో సాటి రాదు. ఎందుకంటే తెలుగు సినిమాల్లో సీత అంటే ప్రేక్షకుడు ఒకలా వూహించుకుంటాడు, కానీ ఈరోజు విడుదల చేసిన ఫోటోలో కృతి సనన్ ఇంకోలా వుంది. ఇంతకీ తెలుగు సీతకి సరిపోయేట్టు సరితూగుతుందా, లేదో సినిమా చూస్తే తెలియాలి.

అయితే ఈలోపు తెలుగు సినిమాల్లో సీత గా వేసిన నటీమణులను చూద్దాం.

anjalidevisita.jpg

సీత అనగానే, మనకి టక్కున గుర్తొచ్చేది 'లవకుశ' #LavaKusa సినిమాలో రాముడు పాత్రలో, అచ్చం అలాగే కనిపించే ఆజానుబాహుడు ఎన్టీఆర్ పక్కన వేసిన అంజలీ దేవి #AnjaliDevi గుర్తుకు వస్తుంది. అసలు ఆ పాత్రకు వన్నె తెచ్చిన నటి అంజలి దేవి 'లవకుశ' లో జీవించింది. అందుకుగాను ఆమెకి అవార్డు కూడా లభించింది. చూస్తున్న ప్రేక్షకుడికి నిజంగా సీతమ్మవారి కిందకి దిగి వచ్చి ఆలా కనిపిస్తున్నారా అన్నంతగా అంజలి దేవి నటించింది. ఇది 1963 లో వచ్చిన చిత్రం. ఈ సినిమాలో పాటలు, అప్పటి నుండి ఇప్పటి వరకు అజరామరంగా ప్రతి దగ్గర వినిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాకి సి. పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు.

chandrakalasita.jpg

దర్శకుడు బాపు #DirectorBapu గారు కొన్ని పౌరాణిక సినిమాలు తీశారు. అందులో మొదటిది 'సంపూర్ణ రామాయణం' #SampoornaRamayanam, ఇది 1972లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి గ్రామాల నుండి ప్రజలు బళ్ళు మీద వచ్చి చూసేవారు. ఈ సినిమా విడుదల అయిన చోట ఒక పెద్ద జాతరలా ఉండేది అప్పట్లో. ఈ సినిమాలో శోభను బాబు #SobhanBabu రాముడుగా నటించగా, సీతగా చంద్రకళ #Chandrakala వేసింది. ఆ అమ్మాయి ఆ పాత్రలో ఒదిగిపోయింది, అంతలా చేసింది సీతగా. ఈ సినిమా రామాయణం ఆధారంగా థీసినదే. ఇందులో రావణాసురిడిగా ఎస్.వి. రంగారావు #SVRangaRao నటన అద్వితీయం, అది వేరే విషయం.

jayapradasitha.jpg

బాపు గారు ఇంకో సినిమా 'సీతా కళ్యాణం' #SeethaKalyanam అని, ఒక్క సీతారాముల కళ్యాణం వరకు మాత్రం ఈ సినిమాలో కథ. ఇందులో రాముడిగా రవికుమార్ #Ravikumar అనే కొత్త అబ్బాయి వెయ్యగా, సీతగా ప్రముఖ నటి జయప్రద #Jayaprada వేసింది. ఇది 1976లో విడుదల అయింది. అప్పటికి జయప్రద ఇంకా కొత్తమ్మాయే. కానీ ఇందులో సీతగా మాత్రం బాపుగారి బొమ్మలా ఎంతో చక్కగా చేసి, అభినయించింది. సీతమ్మ అంటే ఇలా ఉండాలి అని అనిపించేంత బాగా చేసింది.

nayantarasita.jpg

ఆ తరువాత ఇప్పటి ఆధునిక కాలంలో 'శ్రీరామరాజ్యం' #SriramaRajyam అని బాపుగారు తీశారు. ఇది పాత 'లవకుశ' సినిమాకి రీమేక్ లాంటింది. ఇందులో రాముడిగా నందమూరి బాలకృష్ణ #NandamuriBalakrishna వెయ్యగా, సీతగా నయనతార #Nayanathara చేసింది. అప్పుడు చాలామంది విమర్శిచారు నయనతార సీత వెయ్యటం ఏంటి అనీ, ఎందుకంటే అప్పటి వరకు నయనతారని గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువ చూసారు, అలాంటిది ఆమెని సీత పాత్రకి బాపు ఎలా తీసుకున్నారు అని. అయితే అందరి అనుమానాలనూ పటాపంచలు చేస్తూ నయనతార చాలా చక్కని ప్రతిభతో సీతగా చేసి చూపించింది. సినిమా సరిగ్గా నడవలేదు కానీ, సీత పాత్ర వేసిన నయనతారకు మంచి పేరు వచ్చింది. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు #AkkineniNageswaraRao వాల్మీకి పాత్ర వెయ్యడం ఆసక్తికరం. ఇది 2011 లో విడుదల అయింది.

ఎన్.టి. రామారావు గారు స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా 'సీతారామ కళ్యాణం' #SeetharamaKalyanam. ఇందులో అతను చేసిన రావణబ్రహ్మ పాత్ర అజరామరం, అనన్య సామాన్యం, ఆయనొక్కడే ఆలా చెయ్యగలడు, వేరేవాళ్లు చెయ్యలేరు అన్నంతగా ఉంటుంది అతని చేసిన నటన. రామారావు తన సినిమాలో సీతగా గీతాంజలి #Geethanjali ని తీసుకున్నారు. హరనాథ్ #Harinath రాముడుగా వేసాడు. గీతాంజలి ఎక్కడ కనపడినా రామారావు గారు సీతమ్మా అని పిలుస్తూ ఉండేవారట. అంటే ఆమె ఎంత అద్భుతంగా ఆ పాత్రలో మెప్పించిందో చూడండి. ఆ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. ఇందులోనే కాంతారావు నారదుడుగా అపూర్వ నటన ప్రదర్శించేడు. ఇది 1961 లో విడుదల అయింది.

రామారావు గారు మళ్ళీ 'శ్రీరామ పట్టాభిషేకం' #SriramaPattabhishekam అని ఇంకో పౌరాణిక సినిమా దర్శకత్వం, నిర్మాతగా రామాయణం ఆధారంగా తీసారు. ఇందులో అయన రాముడిగా, రావణుడిగా రెండు పాత్రల్లో కనిపించగా, సీత పాత్ర సంగీత #Sangeetha అనే ఆమె చేత చేయించారు. సంగీత కూడా చక్కని అభినయం చేసి చూపించింది. ఇది 1978లో విడుదల అయింది.

ఆ తరువాత కొన్ని సినిమాల్లో సీతగా చిన్న పాత్రల్లో కొంతమంది కనిపించారు. నాగార్జున #Nagarjuna నటించిన 'శ్రీరామదాసు' #Sriramadasu సినిమాలో అర్చన #Archana లేదా వేదా సీత గా కనిపిస్తుంది. 'దేవుళ్ళు' #Devullu సినిమాలో లయ #Laya కూడా సీతగా ఒక చిన్న పాత్రలో కనిపిస్తుంది.

ఇలా చాలామంది సీత పాత్రల్లో వేసి మెప్పించారు. తెలుగు పౌరాణిక సినిమాల్లో సీత పాత్ర అనగానే చూస్తున్న ప్రేక్షకుడికి కూడా ఒకరకమైన భక్తిభావం వచ్చేసేది, అంతలా మన దర్శకులు, నటీనటులు తీశారు, మెప్పించారు. మరి ఇప్పుడు కృతి సనన్ చేసిన సీత దక్షిణాది ప్రేక్షకులకు అంతలా నచ్చకపోవచ్చు అన్న విషయం కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-04-29T16:12:10+05:30 IST