Padmanabham Jayanti: మనల్ని కడుపుబ్బా నవ్వించిన పద్మనాభం కన్న కొడుకు చేతిలోనే..

ABN , First Publish Date - 2023-02-21T15:08:47+05:30 IST

ఆ సంస్థలో మొదటగా నిర్మించిన చిత్రం దేవత నిర్మిస్తే కనక వర్షం కురిసింది.

Padmanabham Jayanti: మనల్ని కడుపుబ్బా నవ్వించిన పద్మనాభం కన్న కొడుకు చేతిలోనే..

వెలుగు చీకటుల తెర మీద నవ్వి నవ్వి అలసిపోయి, పరుల నమ్మి మెసపోయి, మూడు దశాబ్దాల పాటు వెండి వెలుగులతో వెలిగిపోయిన హాస్య చక్రవర్తి పద్మనాభం. నటుడిగానే కాదు, దర్శకుడిగా నిర్మాతగా కూడా సుపరచితుడు పద్మనాభం, ఈ పేరు చెపితే నవ్వు నవ్వి గుర్తుతెచ్చుకుంటాడు సగటు తెలుగుతెరను అభిమానించే ప్రేక్షకుడు. హాస్యం ఆయన ఇంటి పేరు, అమాయకత్వంతో కూడిన చలాకీతనం అది ఆయన ఒంటితనం కాబోలు. దేవత, పొట్టి ప్లీడర్, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, కథానాయిక మొల్ల, శ్రీరామకథ ఇలా ఇప్పుడు క్లాసిక్స్ గా నిలిచిన తెలుగు చిత్రాలన్నీ పద్మానాభం ఊపిరి పోసిన సూపర్ హిట్ మూవీస్.

స్నేహితులు దగ్గర సిమిమా కోసం తీసుకున్న అప్పు ఆయన పీకకు చుట్టుకుంది. అదేలాగంటే మందుపార్టీ అని చెప్పి సదరు స్నేహితులు పద్మనాభం తీసిన సినిమాల మీద నెగటివ్ రైట్స్ రాయించుకున్నారు. అదీ 99 సంవత్సరాలకి,. మందు మాయలో చేసిన పొరపాటును గమనించలేకపోయాడు పద్మనాభం. ఎంతో పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టి డబ్బుని కూడా తెచ్చే బంగారు బాతులాంటి సినిమాలు చేజారిపోయాయి. ఇక సినిమా వైభవం అన్న సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇంకేముంది ఒక్క తప్పుడు నిర్ణయం మొత్తం బ్రతుకునే తల్లకిందులు చేసిపారేసింది. కొండ మీద నుంచి నేల మీదకు తొసేసింది. జీవితంలోని రంగులన్నీ కక్షగట్టి అతని జీవితంలో వెకిలిగా నిలబెట్టాయి. ఏం చేస్తాం మన చేతుల్లో ఏం లేదు. అంతా విధి.

అన్నీ విధి చేయు వింతలే...

అప్పటి దాకా కూడేసుకున్న మిద్దెలు, పొలాలు అన్నీ కరిగి నీరైపోయి, బజారులోకి లాగేసాయి. ఇక నగా, నట్రా అన్నా ఏదైనా ధర పలుకుతాయని చూస్తే అదీ మోసమని తేలింది, పగిలిపోతున్న గుండెను చేతపట్టుకుని తిరిగి మళ్ళీ ఈ పాపపు లోకంలోకి వచ్చి పడ్డాడు. ఈ కష్ట కాలంలోనే పాతిక లక్షల విలువైన వజ్రపుటుంగరం నకిలీదని తేలింది పాపం. అయితే ఇంత మోసం చేసింది కన్న కొడుకేనని తెలిసి మతి పోగొట్టుకుని, కట్టుబట్టలతో రోడ్డున పడ్డాడు.

ఇది కూడా చదవండి: మాతృభాష మన అమ్మభాష..!

బసవరాజు వెంకట పద్మనాభరావు అంటే మన పద్మనాభమే..

1931లో సింహాద్రిపురం పులివెందల మండలం కడపజిల్లాలో జన్మించిన పద్మనాభం తెలుగు చిత్రసీమకు తిరుగులేని కమెడియన్ అంటే అతిశయోక్తి కాదు, తండ్రి ఊరి కరణీకం చేసి పేరు సంపాదించాడు. ఇక పద్మనాభానికి నాలుగోతరగతి చదువుతున్నప్పుడే నాటకాల పిచ్చి మరీ పెరిగిపోయి నటన చేసేంత దాకా తీసుకువచ్చింది. అయితే స్వతహాగా పులుముకున్న పిచ్చి కాదు. తండ్రి నుంచి వచ్చిందే అంటారు అంతా. అయితే గొంతెత్తి పద్యం అందుకుంటే ఆ చిన్న వయసులోనే మాధుర్యంగా పలికేవి స్వరాలు.

చదువుకుంటూనే అమ్మమ్మగారింట నాటకాలలో పొట్టి కృష్ణుడిగా పేరుతెచ్చేసుకున్నాడు. అయితే నటన పిచ్చి పట్టుకుంటే ఓ పట్టాన పోతుందా ఏంటి? 13 ఏళ్ళకే మద్రాస్ బాట పట్టేలా చేసేసింది. ఎన్నో చోట్లకు తిరిగాడు. ఎందరినో కలిసాడు. నటన రాసిపెట్టుంది మరి పద్మనాభానికి తన ఇష్టమైన నటి కన్నాంబగారిని కలిసి పద్యాలు, పాటలు పాడేసి ఆమె మన్ననలు అందుకున్నాడు. ఆమె పద్మనాభాన్ని చూసి ముచ్చటపడి ఇక నా దగ్గరే మా ప్రొడక్షన్ లో ఉండి వచ్చిన అవకాశాలు చూసుకోమంది. నెలకు 40రూపాయల జీతంతో చిన్న చిన్న వేషాలు ఇచ్చేలా భర్తగారి సిఫార్సు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఒకే పొజీషన్‌లో పది నిమిషాల కంటే ఎక్కువగా కూర్చుంటున్న ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..

అయితే మొదటి అవకాశం గూడవల్లి రామబ్రహ్మం ఇవ్వగా 1945లో మాయాలోకంతో తెరకు పరిచయం అయ్యాడు పద్మనాభం. అందులో అక్కినేని నాగేశ్వరరావు హీరో, శాంత కుమారి హీరోయిన్. ఇంకేముంది ఆతరవాత మన పొట్టి ఫ్లీడర్ వెనక్కు తిరిగి చూసుకుంది లేదు. త్యాగయ్య, నారద నారది, యోగివేమన, భక్త శిరియాళ, వింధ్యారాణి, షావుకారు, పాతాళభైరవి ఇలా సాగిపోయాయి నటనరోజులు. అన్నీ హిట్లే.. మోసం గురో.. అనే డైలాగ్ పాతాభభైరవితో గుర్తింపు మామూలుగా రాలేదు మరి. ఇక హాస్యం పండించే తీరు కడుపుబ్బా నవ్వించే హాస్యం ఆయన సొంతం అయిపోయాయి.

సూర్యకాంతం - రమణారెడ్డి,

రేలంగి - గిరిజ,

పద్మనాభం - గీతాంజలి,

రాజబాబు - రమాప్రభ,

అల్లురామలింగయ్య - ఛాయాదేవి,

సుత్తి వీరభద్రరావు - శ్రీలక్ష్మి,

బ్రహ్మానందం - కోవై సరళ.

మన తెలుగు వారు హాయిగా నవ్వుకున్నారంటే....ఈ జంటలలా...కుదిరాయి!

WhatsApp Image 2023-02-21 at 12.12.58 PM.jpeg

నటుడిగా మాత్రమే మిగిలిపోయినా బావుండు..

హాస్యం పండించుకుంటూ వచ్చింది అనుభవిస్తూ పోతే బావుండేది. కానీ పద్మనాభం చేసింది అది కాదుగా.. నటుడిగా ఉంటూనే రేఖా, మురళి ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా చాలా చిత్రాలు నిర్మించాడు. ఆ సంస్థలో మొదటగా నిర్మించిన చిత్రం దేవత నిర్మిస్తే కనక వర్షం కురిసింది. ఇక తిరుగులేదనుకుంటూనే నటిస్తూనే చిత్రాలు నిర్మించడం మొదలు పెట్టాడు. దాదాపు అన్నీ హిట్లే..

ప్రజాభిమానం తప్ప మరేం లేదు. పద్మ అవార్డులేమీ లేవు!

నటన తప్ప ప్రతిఫలం ఆశించని తనం పద్మనాభానికి మాత్రమే చెల్లింది. ఎన్నో చిత్రాలలో నటించినా ప్రజాభిమానం తప్ప, అవార్డులు వరించింది ఏంలేదు. కాకపోతే తను నిర్మించిన కథానాయిక మొల్లకు మాత్రం నంది అవార్డ్ వచ్చింది. ముగ్గురు భార్యలున్న పద్మనాభానిది నిండైన సంసారం, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు, ఎన్నో మజిలీలు చూసిన జీవితం, నిలిచి గెలిచి ఓడిన జీవన ప్రస్థానం, ఇదంతా చూసి వైరాగ్యం చెందక తన 78ఏళ్ళ వయసులో ఫిబ్రవరి నెలలో కీర్తిశేషులైయ్యారు పద్మనాభం, ఎందరో వచ్చి పోయే ఈ జగన్నాటక రంగంలో పద్మనాభం మజిలీ హాస్య నటుడిగా అజరామరం.

Updated Date - 2023-02-21T15:08:49+05:30 IST