Megastar Chiranjeevi: భవిష్యత్‌ తరాలకు మీరే ఆదర్శం!

ABN , First Publish Date - 2023-03-08T17:20:10+05:30 IST

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని (international Womens Day) పురస్కరించుకుని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi Wishes to womens) మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Megastar Chiranjeevi: భవిష్యత్‌ తరాలకు మీరే ఆదర్శం!

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని (international Womens Day) పురస్కరించుకుని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi Wishes to womens) మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా భార్య సురేఖ, తల్లి అంజనా దేవితో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ‘‘ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో తమకంటూ సరైన స్థానాన్ని పొందేందుకు పోరాడిన, పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలందరికీ వందనం. భవిష్యత్తు తరాలకు మీరే ఆదర్శం. నా జీవితంలో అత్యంత ప్రతిభావంతమైన మహిళలు వీరిద్దరే.’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు చిరు. (Inspiring persons ofr Future)

తాజాగా ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya)బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. రూ.240 కోట్లకుపైగా గ్రాస్‌ వసూలు చేసింది. ప్రస్తుతం చిరంజీవి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ (Bhola shankar) చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్‌ చిరుకి సోదరిగా నటిస్తోంది. క్రియటివ్‌ కమర్షియల్స్‌ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాంబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-03-08T17:20:11+05:30 IST