Chiranjeevi-Ramcharan Bday: చరిత్రలో నిలిచిపోతుంది!

ABN , First Publish Date - 2023-03-28T19:48:08+05:30 IST

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు సోమవారం తన నివాసంలో ఘనంగా జరిగాయి. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌కు ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం.

Chiranjeevi-Ramcharan Bday: చరిత్రలో నిలిచిపోతుంది!

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు సోమవారం తన నివాసంలో ఘనంగా జరిగాయి. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌కు ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం. ఆయన కీలక పాత్ర పోషించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందడం, ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అందుకోవడంతోపాటు చెర్రీ త్వరలోనే తండ్రిగా ప్రమోట్‌ కానున్నారు. అందుకే ఈ పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా నిర్వహించారు ఉపాసన. ఈ పార్టీకి రాజమౌళి(Rajamouli) కుటుంబం, కీరవాణి కుటుంబం, నాగార్జున, వెంకటేశ్‌, కాజల్‌ అగర్వాల్‌, అడివి శేష్‌, విజయ్‌ దేవరకొండ, అల్లు అరవింద్‌, మైత్రీ నిర్మాతలు, భోగవల్లి ప్రసాద్‌, జెమినీ కిరణ్‌, అశ్వినీదత్‌, కె.ఎస్‌.రామారావు, దిల్‌ రాజు, సునీల్‌ నారంగ్‌, అఖిల్‌, కీరవాణి, వల్లీ, కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, ప్రేమ్‌రక్షిత్‌ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిరంజీవి (Chiranjeevi Felicitation to RRR Team) ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట విజేతలను శాలువాతో సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

‘‘రామ్‌ చరణ్‌ పుట్టినరోజున అయినవాళ్లు, ఆత్మీయుల సమక్షంలో ఆస్కార్‌ (oscar95) విజేతలను సన్మానించడం ఓ వేడుకలా జరిగింది. తెలుగువారు భారతీయ సినిమాకు సాధించిన ఈ పురస్కారం చరిత్రలో నిలిచిపోతుంది’’ అని చిరంజీవి పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

2.jpg

3.jpgUntitled-2.jpg555.jpg

Updated Date - 2023-03-28T20:06:46+05:30 IST