Chiranjeevi Wishes : సీఎం రేవంత్ రెడ్డికి సెలబ్రిటీల శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-12-07T14:37:09+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి  (Revanth Reddy Outh) టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

Chiranjeevi Wishes : సీఎం రేవంత్ రెడ్డికి సెలబ్రిటీల శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి  (Revanth Reddy Outh) టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. 'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంతరెడ్డి గారికి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కకు కూడా చిరు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన మొదటి వ్యక్తి చిరంజీవే! ప్రస్తుతం ఆయన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గురువారం ఎల్ బి  స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం తరువాత వరుసగా మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ముందుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఇలా వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు.

Updated Date - 2023-12-07T18:58:03+05:30 IST