Chiranjeevi: ‘తారకరత్నని కాపాడినందుకు కృతజ్ఞతలు’

ABN, First Publish Date - 2023-01-31T10:18:56+05:30

టాలీవుడ్ నటుడు తారకరత్న (Tarakaratna) బెంగుళూరులో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం టీడీపీ నేత లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో..

Chiranjeevi: ‘తారకరత్నని కాపాడినందుకు కృతజ్ఞతలు’
Chiranjeevi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ నటుడు తారకరత్న (Tarakaratna) బెంగుళూరులో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం టీడీపీ నేత లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ శ్రేణులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా.. గుండెకి స్టంట్ కూడా వేశారు. అనంతరం బెంగుళూరులోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అయితే, తారకరత్న పరిస్థితి గురించి తెలిసిన ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు.

tarakaratna.jpg

చిరంజీవి చేసిన ట్వీట్‌లో.. ‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. నీకు మంచి ఆరోగ్యంతో (healthy life) కూడిన ధీర్ఘాయువు ఉంది తారకరత్న’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2023-01-31T10:44:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!