Chiranjeevi: ఆడబిడ్డ పుట్టుక మాకు ఎంతో అపురూపం!

ABN , First Publish Date - 2023-06-20T12:51:49+05:30 IST

‘‘నీ రాకతో కోట్ల మంది మెగా అభిమానులకు ఆనందాన్ని పంచావు. రామ్‌ చరణ్‌, ఉపాసనలను తల్లిదండ్రులను చేశావు.. మమ్మల్ని గ్రాండ్‌ పేరంట్స్‌ను చేశావు. ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది’ అని ట్వీట్‌ చేసిన చిరంజీవి మీడియా ముందుకొచ్చి తన మనవరాలు గురించి మాట్లాడారు.

Chiranjeevi: ఆడబిడ్డ పుట్టుక మాకు ఎంతో అపురూపం!

‘‘నీ రాకతో కోట్ల మంది మెగా అభిమానులకు ఆనందాన్ని పంచావు. రామ్‌ చరణ్‌(Ram charan), ఉపాసనలను (Upasana) తల్లిదండ్రులను చేశావు.. మమ్మల్ని గ్రాండ్‌ పేరంట్స్‌ను చేశావు. ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది’ అని ట్వీట్‌ చేసిన చిరంజీవి మీడియా ముందుకొచ్చి తన మనవరాలు గురించి మాట్లాడారు. Chiranjeevi About Grand daughter)

‘మంగళవారం 1.49 నిమిషాలకు (అర్ధరాత్రి) రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మా ఇంటిల్లపాదీ ఎంతో ఆనందంగా ఉన్నాం. ఆడబిడ్డ పుట్టుక మాకు ఎంతో అపురూపం. ఎన్నో సంవత్సరాలుగా వారిద్దరూ తల్లిదండ్రులు కావాలని, మా చేతిలో బిడ్డను పెట్టాలని కోరుకుంటున్నాం. భగవంతుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమాభిమానాలతో రామ్‌చరణ్‌ - ఉపాసన తల్లిదండ్రులయ్యారు. ఇక్కడివారితోపాటు ఇతర దేశాల నుంచి బంధువులు, శ్రేయభిలాషులు, మా ఆనందాన్నే తమ ఆనందంగా భావించే మా అభిమానులు వివిధ రూపాల్లో మా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. చాలా ఆనందంగా ఉంది.

మంచి ఘడియాల్లోనే...

మా మనవరాలు మంచి ఘడియల్లో పుట్టిందని పెద్దలు చెబుతున్నారు. ఆ ప్రభావం ముందు నుంచీ చూపిస్తూనే ఉంది. రామ్‌చరణ్‌ ఎదుగుదల, ఎఛీవ్‌మెంట్స్‌, ఈ మఽధ్యనే వరుణ్‌తేజ్‌ నిశ్చితార్థం ఇలా అన్నీ శుభపరిణామాలే! ప్రసవం అనంతరం పాపను చూశా. పోలిక ఎవరిది అనేది అప్పుడే చెప్పలేం కదా! ఉపాసన ప్రసవం ట్రీట్‌మెంట్‌ విషయంలో పీసీ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మా ఇంటి దైవం ఆంజనేయస్వామివారికి అత్యంత ఇష్టమైన మంగళవారం నాడు ఆడబిడ్డను మనవరాలిగా ప్రసాదించడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. రామ్‌చరణ్‌ - ఉపాసనలకు 2012 జూన్‌లో పెళ్లైంది. పుష్కర కాలం తర్వాత ఈ జంట ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Updated Date - 2023-06-20T13:07:58+05:30 IST