సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chiranjeevi: బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో వచ్చాడు..

ABN, First Publish Date - 2023-04-21T21:14:49+05:30

మెగాస్టార్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai dharam tej) నటించిన ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రం ఘన విజయం సాధించడంతో చిరంజీవి (Chiranjeevi tweet on Virupaksha) ట్విట్టర్‌ వేదికగా తేజ్‌, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai dharam tej) నటించిన ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రం ఘన విజయం సాధించడంతో చిరంజీవి (Chiranjeevi tweet on Virupaksha) ట్విట్టర్‌ వేదికగా తేజ్‌, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ చిత్రం విజయాన్ని పురస్కరించుకుని చిరంజీవి, హీరో తేజ్‌కు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘విరూపాక్ష’ సినిమాకు వస్తున్న అద్బుతమైన స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. సాయిధరమ్‌ తేజ్‌ మంచి బ్లాక్‌ బస్టర్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తనకు ఈ విజయం దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ఆడియన్స్‌ ప్రశంసలు, అభినందనలు, అందించడం ఎంతో సంతోషం. ఈ సందర్బ్భంగా ఈ చితానికి పని చేసిన నటీనటులు, సాంకేతికనిపుణులకు నా హృదయపూర్వక అభినందనలు’’ అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు.

సాయితేజ్‌ సరసన మలయాళ బ్యూటీ సంయుక్తమీనన్‌ (samyuktha menon) కథానాయికగా నటించింది. కార్తిక్‌ వర్మ దండు దర్శకత్వంలో బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా బీవీఎస్‌ఎన్‌ ప్రస?ద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. (BVSN Prasad)

Updated Date - 2023-04-21T21:15:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!