సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chiranjeevi: నాని గురించి చిరంజీవి ఏమన్నారంటే!

ABN, First Publish Date - 2023-04-13T12:27:47+05:30

నాని, కీర్తి సురేశ్‌ జంటగా ఓదెల శ్రీకాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సొంతం చేసుకోవడంతోపాటు విమర్శలకు ప్రశంసలు అందుకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'దసరా' (Dasara) సినిమాపై మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. నాని(nani), కీర్తి సురేశ్‌(keerthi suresh)ల నటన, మేకోవర్‌తోపాటు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం (Odela srikanth) అద్భుతంగా ఉందని అన్నారు. ఈ మేరకు ఓ లేఖను పోస్ట్‌ చేశారు. ‘‘డియర్‌ నాని.. దసరా సినిమా చూశాను. బాగా నచ్చింది. గొప్ప సినిమా ఇది. నీ నటన, మేకోవర్‌తో స్ర్కీన్‌ని చంపేశావ్‌ అంతే! నీ నటన అంతగా ఆకట్టుకుంది. దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ దర్శకత్వం శైలి బావుంది. ఆయనకిది తొలి చిత్రమని తెలిసి ఆశ్చర్యపోయాను. డైరెక్షన్‌ అదిరిపోయింది. ‘మహానటి’ కీర్తి నటన అదిరిపోయింది. దీక్షిత్‌శెట్టి కూడా బాగా చేశాడు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం బాగా కుదిరింది. ఎంటైర్‌ దసరా టీమ్‌కు అభినందనలు’’ అని అన్నారు. ప్రస్తుతం చిరు ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. (Chiranjeevi Shock with Nani Performence)

నాని, కీర్తి సురేశ్‌ జంటగా ఓదెల శ్రీకాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సొంతం చేసుకోవడంతోపాటు విమర్శలకు ప్రశంసలు అందుకొంది. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేఽశ్‌ అదరగొట్టేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు.

Updated Date - 2023-04-13T12:27:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!