Chiranjeevi: యువ దర్శకుడి లైన్‌కి.. చిరు సై?

ABN , First Publish Date - 2023-04-14T09:19:11+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి యువహీరోలతో పోటీపడుతున్న సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Chiranjeevi: యువ దర్శకుడి లైన్‌కి.. చిరు సై?

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) యువ హీరోలతో పోటీపడుతున్న సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మరో సినిమా కమిట్‌ అయ్యారని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తుంది. ‘బింబిసార’ ఫేమ్‌ (Bimbisara Fame) వశిష్ఠ కాంబినేషన్‌లో చిరు ఓ సినిమా చేయబోతున్నారా? ఇప్పటికే కథ విన్నారా? అంటే అవుననే సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వశిష్ఠ చిరంజీవికి ఓ లైన్‌ చెప్పారట. ఆ లైన్‌ చిరంజీవికి నచ్చడంతో స్ర్కిప్ట్‌ను తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. యూవి క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ‘బింబిసారా’ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్నారు వశిష్ఠ (Mallidi Vasishta). ఆ చిత్రంతో ఒక్కసారిగా ఆయన క్రేజ్‌ పెరిగింది. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు అడ్వాన్స్‌ ఇచ్చాయని టాక్‌. ‘బింబిసారా’ విజయం సాధించగానే మొదట గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ వశిష్ఠకు అడ్వాన్స్‌ ఇచ్చారని టాక్‌ వినిపించింది. ఇప్పుడు యు.వి.క్రియేషన్స్‌ కూడా క్యూలో ఉందని తెలిసింది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair veerayya) బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే! కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ చిరుకి తమ్ముడిగా నటించారు. శ్రుతీహాసన్‌, కేథరిన్‌ కథానాయికలు. ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్‌’తో (bhola shankar) బిజీగా ఉన్నారు. తమిళ వేదాళం చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ చిత్రంలో తమన్నా కథానాయిక. కీర్తి సురేశ్‌ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 11న ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - 2023-04-14T09:19:13+05:30 IST