Chiranjeevi: ఫాంటసీ కథ.. దర్శకుడికి బంఫర్‌ ఆఫర్‌!

ABN , First Publish Date - 2023-04-17T10:11:47+05:30 IST

చిరంజీవి (Chiranjeevi) ‘భోళా శంకర్‌’ (Bhola shankar) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తయింది.

Chiranjeevi: ఫాంటసీ కథ.. దర్శకుడికి బంఫర్‌ ఆఫర్‌!

చిరంజీవి (Chiranjeevi) ‘భోళా శంకర్‌’ (Bhola shankar) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటు భోళా శంకర్‌ షూటింగ్‌ చేస్తూనే, తదుపరి చిత్రంపై కూడా దృష్టిపెట్టారు చిరు. ‘బింబిసారా’తో విజయం అందుకున్న వశిష్ఠతో చిరు తన తదుపరి చిత్రం చేయబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! అయితే నిజంగానే వశిష్ఠ బంపర్‌ ఆఫర్‌ కొట్టారని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. వశిష్ఠ (Mallidi Vasishta)‘బింబిసార 2’ కథ పనుల్లో ఉన్నారు. అయితే ఆ చిత్రం ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు చిరుతో ఓ సినిమా చేయడానికి వశిష్ఠ ప్లాన్‌ చేశారట. చిరంజీవి దీనికి అంగీకారం కూడా తెలిపారు. ఇదొక సోషియో ఫాంటసీ కథ (Socio-Fantasy) అనీ, గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యం ఉన్న సినిమా అని తెలిసింది. యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మించబోతోందని తెలిసింది. ఆగస్టు నుంచి వశిష్టకు చిరు డేట్లు ఇచ్చినట్టు సమాచారం.

అయితే వశిష్ఠ చిరంజీవితో సినిమా అనుకోలేదు. రామ్‌చరణ్‌ (RamCharan)కోసం ఓ కథ రాసి, అతన్ని ఒప్పించే పనిలో ఉన్న సమయంలో చిరంజీవి కథ విన్నారు. అదే సమయంలో మరో ఐడియాను చిరుతో షేర్‌ చేసుకున్నారట వశిష్ఠ. ఆ ఐడియా ఆయనకు నచ్చడంతో చరణ్‌ కథను పక్కనపెట్టి ఈ కథపై ఫోకస్‌ పెట్టమన్నారట. అలా చరణ్‌తో సినిమా చేద్దామని వెళ్లిన వశిష్టకు.. ఇలా చిరంజీవిని డైరెక్ట్‌ చేసే బంఫర్‌ ఆఫర్‌ తగిలింది. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించారు.

Updated Date - 2023-04-17T10:12:25+05:30 IST