Chiranjeevi: నీకే బిడ్డలుగా పుట్టాలి!

ABN , First Publish Date - 2023-01-29T18:29:27+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టిరోజు నేడు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబం అంతా ఆమెతో దిగిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు చిరు. మెగా బ్రదర్స్‌ ముగ్గురూ ఉన్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Chiranjeevi: నీకే బిడ్డలుగా పుట్టాలి!

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)తల్లి అంజనాదేవి(Anjana devi) పుట్టిరోజు నేడు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబం అంతా ఆమెతో దిగిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు చిరు. మెగా బ్రదర్స్‌ ముగ్గురూ ఉన్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘ఈరోజు మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలకి నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాను అమ్మా. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. (hbd anjana devi)

చిరంజీవి హీరోగా సంక్రాంతి బరితో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. రూ. 250 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న చిరు త్వరలో ‘భోళా శంకర్‌’ షూటింగ్‌తో బిజీ కానున్నారు.

Updated Date - 2023-01-29T18:29:28+05:30 IST