మెగా వింటేజ్‌ లుక్‌

ABN , First Publish Date - 2023-05-02T00:35:26+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు మెహర్‌ రమేశ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మాసివ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళాశంకర్‌’ చిత్రం కోసం తీస్తున్న ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ పూర్తయింది.

మెగా వింటేజ్‌ లుక్‌

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు మెహర్‌ రమేశ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మాసివ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళాశంకర్‌’ చిత్రం కోసం తీస్తున్న ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ పూర్తయింది. దీనితో ఎనభై శాతం చిత్రం పూర్తయినట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు. మే డే సందర్భంగా చిరంజీవి మింటేజ్‌ మాస్‌ లుక్‌లో కనిపించే మూడు పోస్టర్లు విడుదల చేశారు. గ్రే కలర్‌ యూనిఫామ్‌లో టాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి యంగ్‌ అండ్‌ డైనమిక్‌గా కనిపిస్తున్నారు. ‘మా సినిమా తదుపరి షెడ్యూల్‌ కోల్‌కతాలో జరుగుతుంది. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను యూరప్‌ లో చిత్రీకరించనున్నాం. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్‌, క్లైమాక్స్‌ , భారీ సెట్‌ సాంగ్‌ చిత్రీకరిస్తాం. దీంతో జూన్‌ నెలాఖరుకు సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది’ అని చెప్పారు నిర్మాత రామబ్రహ్మం సుంకర. యాక్షన్‌ పార్ట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సమపాళ్లలో ఉండే ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ చిరంజీవి సోదరిగా నటిస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

Updated Date - 2023-05-02T14:00:44+05:30 IST