సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chiranjeevi - Keeravani: 29 ఏళ్ల తర్వాత.. సోషియో ఫాంటసీతో..

ABN, First Publish Date - 2023-06-20T16:59:34+05:30

చిరంజీవి, కీరవాణిల హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో ‘ఘరానా మొగుడు’, ‘అపద్బాంధవుడు’, ‘ఎస్‌.పి.పరశురామ్‌’ వంటి చిత్రాలు హిట్‌ ఆల్బమ్స్‌ ఇచ్చారు. చిరంజీవి కీరవాణి ఇచ్చే సంగీతం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యి ఏళ్లు గడుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరంజీవి(Chiranjeevi), కీరవాణిల(keeravani) హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో ‘ఘరానా మొగుడు’, ‘అపద్బాంధవుడు’, ‘ఎస్‌.పి.పరశురామ్‌’ వంటి చిత్రాలు హిట్‌ ఆల్బమ్స్‌ ఇచ్చారు. చిరంజీవి కీరవాణి ఇచ్చే సంగీతం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యి ఏళ్లు గడుస్తోంది. చాలాకాలంగా చిరు చిత్రాలకు మణిశర్మ, ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్‌, ఈ మధ్యకాలంలో తమన్‌ సంగీతం అందిస్తూ వస్తున్నారు. అయితే చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్‌’ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్‌ సంగీతం అందిసున్నారు. అయితే చిరంజీవి, కీరవాణి కాంబో రిపీట్‌ కానుందనే వార్త కొద్దిరోజులుగా హల్‌చల్‌ చేస్తోంది.

చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట (Vasista)దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారని తెలిసింది. బింబిసారా సక్సెస్‌ కీరవాణి పాత్ర చాలా ఉంది. అందుకే దర్శకుడు వశిష్ఠ ఆయన్నే తన తదుపరి చిత్రానికి కొనసాగించాలనుకుంటున్నారట. సోషియో ఫాంటసీ కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అయితేనే వంద శాతం న్యాయం జరుగుతుందని చిరంజీవి కూడా కీరవాణికే ఓటేశారని సమాచారం. ఈ చిత్రానికి ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Updated Date - 2023-06-20T16:59:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!