Chiranjeevi: బేబి సక్సెస్‌ చిరంజీవి ఏం చెప్పారంటే...

ABN , First Publish Date - 2023-07-31T10:56:28+05:30 IST

‘‘నేను పుత్రోత్సహాన్ని ఎంతగా ఆస్వాదిస్తున్నానో.. ఇండస్ట్రీలో నా అభిమానుల ఎదుగుదల చూసి అంతే ఆనందిస్తున్నా. మనం పాతతరంలోనే ఆగిపోతే పరిశ్రమ వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి. అప్పుడే చిత్రసీమ కొత్త పుంతలు తొక్కుతూ నిరంతరంగా ముందుకు సాగుతుంది. మనం ఎంత కష్టపడితే అంత గొప్పగా మనల్ని నిలబెట్టే పరిశ్రమ ఇది’’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.

Chiranjeevi: బేబి సక్సెస్‌ చిరంజీవి ఏం చెప్పారంటే...

‘‘నేను పుత్రోత్సహాన్ని ఎంతగా ఆస్వాదిస్తున్నానో.. ఇండస్ట్రీలో నా అభిమానుల ఎదుగుదల చూసి అంతే ఆనందిస్తున్నా. మనం పాతతరంలోనే ఆగిపోతే పరిశ్రమ వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి. అప్పుడే చిత్రసీమ కొత్త పుంతలు తొక్కుతూ నిరంతరంగా ముందుకు సాగుతుంది. మనం ఎంత కష్టపడితే అంత గొప్పగా మనల్ని నిలబెట్టే పరిశ్రమ ఇది’’ అని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘బేబి’ (Baby) చిత్ర మెగా కల్ట్‌ సెలబ్రేషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించిన (Sai Rajesh) చిత్రమిది. ఎస్‌కేఎన్‌ నిర్మాత. (SKN)

విజయోత్సవ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘నా అభిమానులు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్‌ అయినందుకు గర్వంగా ఉంది. సాయిరాజేశ్‌ స్పూఫ్‌ చిత్రాలు తీయడమే కాదు జాతీయ పురస్కారం అందుకున్న చిత్రాలకు కథ అందించగలనని ‘కలర్‌ ఫొటో’తో నిరూపించాడు. అతని దర్శకత్వంలో వచ్చిన ‘బేబి’ నాకెంతో నచ్చింది. సమకాలీన కథ, అందులోని దర్శక విలువల దాని ద్వారా రాజేష్‌ ఇచ్చిన సందేశం మామూలుది కాదు. ఆనంద్‌ చాలా సహజంగా నటించాడు. ప్రియురాలి గురించి నిజం తెలిసిన సందర్భంలో ఆనంద్‌ కనబరిచిన భావోద్వేగాలు చూసి అతనిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా? అని ఆశ్చర్యపోయా. విరాజ్‌, అశ్విన్‌ చక్కగా నటించారు. లవ్‌ స్టోరిస్‌ చాలా చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో అందరూ మంచి వాళ్లే. విలన్‌ లేకుండా ఇంత బాగా చూపించగలిగారు అంటే సర్‌ ప్రైజ్‌ అయ్యాను .జీవితంలో తెలిసో తెలియకో ఒక తప్పు చేసినా బాధపడుతూ కూర్చోకుండా మంచి లైఫ్‌ ఉంటుందనే ఆశతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు’.

2.jpg


సహజనటి వైష్ణవి...

కథలో భాగంగా వైష్ణవి మానసిక సంఘర్షణ ఈ చిత్రాన్ని నిలబెట్టింది. జయసుధ గ్లామర్‌, డీ గ్లామర్‌ ఏ పాత్ర ఇచ్చిన సహజంగా నటించగలదు. ఇందులో వైష్ణవి పాత్ర చూశాక సహజనటి వైష్ణవి అనిపించింది. నా మాట వ్యర్థం కాదనిపిస్తుంది. నటిగా వైష్ణవి భవిష్యత్తు నాకు కనిపిస్తోంది. ఈ సినిమా ఫీలింగ్‌ నుంచి బయటకు రావడానికి నాకు మూడు రోజులు పట్టింది.

3.jpg

ఇంతకన్నా ఏం కావాలి!

‘‘అభిమానుల నుంచి నా మేనల్లుళ్లు, మిత్రుల నాతోపాటు ఎదుగుతూ విజయాన్ని అందుకుంటుంటే సంతోషపడుతున్నా. నాకు దేవుడు ఇచ్చిన తమ్ముళ్లైన అభిమానులు నన్ను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా సాధించవచ్చు అని తమ మార్క్‌ చూపిస్తూ సక్సెస్‌ అందుకుంటుంటే మాటల్లో చెప్పలేని ఆనందంగా కలుగుతోంది. అభిమానులు అంటే థియేటర్‌లో సినిమా చూసే దగ్గరే ఆగిపోవడం కాదు. ఇలా మమ్మల్ని, మా సినిమాల్ని చూసి పొందిన స్పూర్తి ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఇలా తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ విజయాల సాధిస్తుంటే నాకంటే సంతోషించేవారు ఉండరు. ఒకప్పుడు హీరోల అభిమానులంటే లక్ష్యం లేకుండా తిరుగుతారు, చదువుల మీద శ్రద్థ పెట్టరు. మరో హీరో అభిమానులతో గొడవలు పడుతుంటారు అనే టాక్‌ ఉండేది. అవి నా చెవిన పడ్డ సందర్భాలు ఉన్నాయి. అప్పుడే బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ వంటి సామాజిక కార్యక్రమాల చేపట్టి నా అభిమానులంటే సమాజం గర్వించేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా అభిమానులు ఇప్పటే అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పుడు నా అభిమానులైన మారుతి, సాయిరాజేష్‌, ఎస్‌కెఎన్‌ కలిసి చేసిన సినిమా ఘన విజయం సాధించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. మారుతి ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోతో సినిమా తీసే స్థాయికి ఎదిగాడు. ఎస్‌కెఎన్‌ ఏలూరులో నా సినిమాకు బ్యానర్స్‌ కట్టే సమయం తెలుసు. గీతా ఆర్ట్స్‌లో అరవింద్‌ గారు, బన్నీ సపోర్ట్‌తో నిర్మాత స్థాయికి వచ్చాడు. మన ఇండస్ట్రీలో రాజమౌళిలాంటి దర్శకులున్నారు కాబట్టే ఆస్కార్‌ స్థాయికి మన సినిమా చేరింది. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో భాగమైతే అదే మీరు చేేస ప్రత్యుపకారం’’ అని చిరంజీవి అన్నారు.

Updated Date - 2023-07-31T10:56:28+05:30 IST