కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandra Mohan Funeral: చంద్రమోహన్ అంత్యక్రియలు ఎప్పుడు, ఎక్కడ వివరాలు

ABN, First Publish Date - 2023-11-11T15:48:43+05:30

ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 82 ఏళ్ల చంద్రమోహన్ సుమారు 900కి పైగా చిత్రాలలో నటించారు. అతని పార్థివ శరీరం ఆసుపత్రి నుండి, ఫిలిం నగర్ లో వున్న అతని ఇంటి దగ్గరకి తరలించారు. అంత్యక్రియలకు ఎక్కడ, ఎప్పుడు చేస్తారు అనే విషయం కూడా...

Chandra Mohan passed away on Saturday morning in Hyderabad

ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan passed away) ఈరోజు ఉదయం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. చంద్రమోహన్ పార్థివ శరీరం ఆసుపత్రి నుండి ఫిలింనగర్ లో వున్న తన ఇంటికి తరలించారు. పరిశ్రమ నుండి చాలామంది నిర్మాతలు, దర్శకులు, నటులు చంద్రమోహన్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. చంద్రమోహన్ (Chandra Mohan) చిన్న కుమార్తె చెన్నై నుండి ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. (Chandra Mohan funeral on Monday) చంద్రమోహన్ పార్దీవ దేహాన్ని అభిమానుల, పరిశ్రమలోని వారి సందర్శనార్థం ఫిలింనగర్ లోని ఆయన ఇంటి వద్దనే ఏర్పాట్లు చేసిన చంద్రమోహన్ కుటుంబ సభ్యులు.

అలాగే చంద్రమోహన్ పెద్ద కుమార్తె అమెరికాలో ఉండటం వలన ఆమె రాక కోసమని చంద్రమోహన్ పార్థివ శరీరాన్ని అతని ఇంట్లోనే ఆమె వచ్చేంతవరకు వుంచుతారని కుటుంబ సభ్యుల వలన తెలుస్తోంది. పండగ వేళ ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఫిలిం ఛాంబర్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచడం లేదని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. (Veteran Telugu actor Chandra Mohan passed away) ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, చంద్రమోహన్ కి స్వయానా మేనల్లుడు అవుతాడు. అతను సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు జరుపుతామని చెపుతున్నారు. (Tollywood actor)

అయితే అంత్యక్రియలు జరిపే స్థలం ఎక్కడ అనేది చంద్రమోహన్ కుమార్తె అమెరికా నుండి వచ్చిన తరువాత నిర్ణయిస్తారని తెలుస్తోంది. మహాప్రస్థానంలో చేయడమా, లేక పంజాగుట్ట లో చేయడమా, చంద్రమోహన్ కి హైదరాబాదు శివార్లలో ఇంకొక ఫార్మ్ హౌస్ ఉందని, అక్కడ కూడా చేసే యోచనలో కుటుంబ సభ్యులు వున్నారని తెలుస్తోంది. సోమవారం అంత్యక్రియలు ఎక్కడ అనేది రేపు మధ్యాహ్నం తెలుస్తుంది అని చెపుతున్నారు.

Updated Date - 2023-11-11T16:26:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!