Chandra Mohan: నేను చాలా సినిమాలు డబ్బులకోసమే చేసాను: చంద్రమోహన్

ABN , First Publish Date - 2023-11-11T13:30:34+05:30 IST

చంద్రమోహన్ మొదటి సినిమా 'రంగుల రాట్నం', బిఎన్ రెడ్డి దర్శకుడు, నిర్మాత కూడా. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో, సాంకేతికనిపుణలతో పని చేసే అదృష్టం చంద్రమోహన్ కి కలిగింది. అందుకే తన మొదటి సినిమానే బెస్ట్ 'రంగుల రాట్నం' అని అన్నారు చంద్రమోహన్.

Chandra Mohan: నేను చాలా సినిమాలు డబ్బులకోసమే చేసాను: చంద్రమోహన్
Chandra Mohan with Anjali Devi in his debut film Rangula Ratnam

ఆర్టిస్టుగా 800 సినిమాలు చేసిన చంద్రమోహన్ (Chandra Mohan paased away) ని ఎవరైనా ఎన్ని సినిమాలు చేశారు అంటే, కేవలం 50 సినిమాలు అని చెప్పేవారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు చిత్రసీమలో వుండి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన చంద్రమోహన్ తనకి నచ్చినవి కేవలం 50 సినిమాలే అని, మిగతా సినిమాలు అన్నీ కేవలం డబ్బులకోసం చేసినవే అని చెప్పారు చంద్రమోహన్. (RIPChandraMohan)

ఎన్ని వందల సినిమాలు చేసిన తన మొదటి సినిమా 'రంగులరాట్నం' #RangulaRatnam లో చేసిన పాత్ర తన బెస్ట్ అని చెపుతూ ఉండేవారు అంజలీదేవి (AnjaliDevi), రమణా రెడ్డి, కాకరాల, త్యాగరాజు, రామ్ మోహన్, వాణిశ్రీ (Vanisree) ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు నా గురించి బాగా చేస్తున్నాడు చంద్రమోహన్, కొత్తబ్బాయి అయినా ఆలా కాకుండా బాగా చేస్తున్నాడు అనేవారు. ఎందుకు అలా అనేవారు అని అనుకునేవాడిని, కానీ నాకు కూడా చూసిన తరువాత అదే బెస్ట్ అనిపించింది. అందులో చాలా సహజంగా నా నటన కనిపిస్తుంది.

chandramohanrangularatnam.jpg

'రంగుల రాట్నం' సినిమాకి బి ఎన్ రెడ్డి (BN Reddy) దర్శకుడు, నిర్మాత కూడా. ఈ సినిమాకి కథ పాలగుమ్మి పద్మరాజు, మాటలు డివి నరసరాజు రాశారు. అప్పట్లో పాలగుమ్మి పద్మరాజు అద్భుతమైన కథలు రాసేవారు, సాహిత్యంలో అతని పేరు తెలియని తెలుగువారు లేరంటే అతిశయోక్తి లేదు. దర్శకుడు బిఎన్ రెడ్డి గురించి చెప్పనవసరంలేదు, అతను ఎంతమందో దర్శకులకి స్ఫూర్తిదాత. అటువంటి పెద్ద పెద్ద సాంకేతికనిపుణల దగ్గర తన మొదటి సినిమా చేసిన చంద్రమోహన్, అందుకే అతను గొప్ప నటుడు అయ్యాడు, ఐదు దశాబ్దాల పాటు, అవిశ్రాంతంగా వందల సినిమాలు చేయగలిగారు.

chandramohan-debutmovie.jpg

నా బెస్ట్ సినిమాలో 'రంగులరాట్నం', 'కలికాలం', 'సగటు మనిషి' ఇలా చాలా కొన్ని సినిమాలు వున్నాయి అని చెపుతూ వుంటారు చంద్రమోహన్. దర్శకుడు కె విశ్వనాధ్, తన పెదనాన్నగారి అబ్బాయి అని చెప్పారు చంద్రమోహన్. ఇద్దరు కలిసి పనిచేసిన మొదటి సినిమా 'కాలం మారింది' అని చెప్పారు చంద్రమోహన్. ఆ తరువాత విశ్వనాధ్ గారి అన్ని సినిమాలలో చంద్రమోహన్ ఉంటూ వచ్చారు.

Updated Date - 2023-11-11T13:46:14+05:30 IST