Chandra Bose: అదే జీవిత లక్ష్యం అనుకున్నా.. అదనంగా 20 కేజీల బరువు పెరిగింది!

ABN , First Publish Date - 2023-03-14T13:44:12+05:30 IST

ఆర్‌ఆర్‌ఆర్‌’లోని(RRR) ‘నాటు నాటు’ (Oscar for Natu natu) పాటకు బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అత్యున్నత ఆస్కార్‌ పురస్కారం అందుకున్న తర్వాత గేయ రచయిత చంద్రబోస్‌ (Chandra bose) తన మనసులోని భావాలను పంచుకున్నారు.

Chandra Bose: అదే జీవిత లక్ష్యం అనుకున్నా.. అదనంగా 20 కేజీల బరువు పెరిగింది!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని(RRR) ‘నాటు నాటు’ (Oscar for Natu natu) పాటకు బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అత్యున్నత ఆస్కార్‌ పురస్కారం అందుకున్న తర్వాత గేయ రచయిత చంద్రబోస్‌ (Chandra bose) తన మనసులోని భావాలను పంచుకున్నారు. గోల్డెన్‌గ్లోబ్‌, హాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డులు వచ్చినప్పుడే ఆస్కార్‌ కూడా ఖాయమనే నమ్మకం కలిగిందన్నారు. గేయ రచయితగా పదిరెట్టు బాధ్యత పెరిగిందని చెప్పారు. ఆస్కార్‌ వేదికపైకి వెళ్లగానే దేశ కీర్తిని, తెలుగు సాహిత్య గౌరవాన్ని చేతిలో నిలుపుకొన్నట్లు అనిపించిందని, ఆ క్షణాలను అనిర్వచనీయమైన అనుభూతి కలిగించాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్‌ ప్రతిమను తాకినప్పుడు, అందరి కల సాకారమైన ఆ క్షణాన తెలియని భావోద్వేగం కలిగింది. (Oscar winner Chandrabose)

ఒక పాట.. 19 నెలలు...(19 months For one song)

సాహిత్యంతోపాటు సహనానికి కూడా వచ్చిన పురస్కారంగా భావిస్తున్నాను. రచయితగా 27 ఏళ్ల జర్నీలో ఒకపాట కోసం 19 నెలలు కష్టపడిన సందర్భం ఒకటీ లేదు. ఎలాంటి పాటైనా నాలుగైదు రోజులు లేదా ఒక నెల అంతే! కానీ నాటు నాటు’ పాటకు 19 నెలలు పట్టింది. ఎక్కడా సహనాన్ని కోల్పోకుండా ఒక్కొక్క పదం పేర్చుకుంటూ, కూర్చుకుంటూ జాగ్రత్తగా రాశా. ఓ సందర్భంలో ఈ పాట ఉంటుందా లేదా అన్న అనుమానం కూడా కలిగింది. ఫైనల్‌ ఇలా ఆస్కార్‌ జరిగింది.

ఒక్క జాతీయ పురస్కారమైనా...

గేయ రచయితగా ఇన్నేళ్ల జర్నీలో ఎప్పుడు పురస్కారాల గురించా ఆలోచన పెద్దగా రాలేదు. ఒక జాతీయ పురస్కారం గురించి కలలు కన్నాను ఒకసారైనా జాతీయ పురస్కారం అందుకోవాలని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నా. అది నెరవేరకముందే గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌, హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌తో పాటు ఆస్కార్‌ ఇలా నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి.

బరువు పడింది.. బాధ్యత పెరిగింది...(Bose responsibility)

ఏ కళాకారుడికైనా పురస్కారం బాధ్యత పెంచుతుంది అంటారు. అది నిజమే అన్నది అందరికీ తెలిసిందే. అయితే నేనిప్పుడు కళ్లారా చూస్తున్నా. నేను జాతీయ పురస్కారం కోసం ఆరాటపడ్డాను. అంతర్జాతీయ పురస్కారం వరించింది. ఇంత కన్నా ఆనందం ఏముంటుంది. అంతే కాదు.. బరువు బాఽధ్యత కూడా పెరిగింది. ఆస్కార్‌ బరువు మూడున్నర కేజీలు, గోల్డెన్‌ గ్లోబ్‌ ఏడు కేజీలు, క్రిటిక్స్‌ ఛాయిస్‌ బరువు ఆరు కేజీలు. ఇప్పుడు నాపై అదనంగా 20 కేజీలకు పైగా బరువు పడింది. కాబట్టి ఇంకా జాగ్రత్తగా అడుగులేస్తూ రాయాలి.

Updated Date - 2023-03-14T14:05:17+05:30 IST