Chalaki Chanti: గుండెపోటు.. ప్రస్తుతం నిలకడగానే!

ABN , First Publish Date - 2023-04-24T10:00:51+05:30 IST

హాస్యనటుడు, జబర్దస్త్‌ చలాకీ చంటి (Chalaki Chanti) అస్వస్థతకు గురయ్యారు.

Chalaki Chanti: గుండెపోటు.. ప్రస్తుతం నిలకడగానే!

హాస్యనటుడు, జబర్దస్త్‌ చలాకీ చంటి (Chalaki Chanti) అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతీనొప్పి (Heart attack)రావడంతో ఈ నెల 21న కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. చంటి ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన వైద్యులు పరీక్షలు నిర్వహించి.. రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆయనకు స్టంట్‌ వేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చంటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. Chanti Hospitalized with Heart attack)

జబర్దస్త్‌ (jabardast) కామెడీ షోతో చలాకీ చంటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ టైమింగ్, పంచ్‌లు ఆయన బలం. బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో ఇంటి సభ్యుడిగా హౌస్‌లో సందడి చేశారు. తనదైన శైలి ఆటతో ప్రేక్షకుల్ని మెప్పించారు కానీ చివరి వరకూ ఇంటిలో నిలవలేకపోయారు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటికొచ్చాక చంటి పెద్దగా ఎక్కడా కనిపించలేదు.

Updated Date - 2023-04-24T10:00:51+05:30 IST