Ram Charan 15: క్రేజీ టైటిల్‌... ఫిక్స్‌ అయినట్లేనా?

ABN , First Publish Date - 2023-03-08T14:22:14+05:30 IST

రామ్‌ చరణ్‌ (Ram charan) హీరోగా అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) దర్శకత్వంలో ఓ చిత్రం (ఆర్‌సీ15 -RC15) రూపొందుతున్న సంగతి తెలిసిందే!

Ram Charan 15: క్రేజీ టైటిల్‌... ఫిక్స్‌ అయినట్లేనా?

రామ్‌ చరణ్‌ (Ram charan) హీరోగా అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) దర్శకత్వంలో ఓ చిత్రం (ఆర్‌సీ15 -RC15) రూపొందుతున్న సంగతి తెలిసిందే! దిల్‌ రాజు (Dil raju pan india movie) నిర్మాతగా భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియాస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్‌-శంకర్‌- దిల్‌ రాజు కాంబినేషన్‌ కావడంతో సినిమాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్‌ వస్తుందని అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రామ్‌చరణ్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. ఇప్పుడు సినిమా టైటిల్‌ ఏంటో తెలుసుకోవాలని అభిమానులని అభిమానుల ఆరాటం. తొలుత ఈ చిత్రానికి ‘సర్కారోడు’ (sarkarodu) అనే టైటిల్‌ వినిపించింది. ఇప్పుడు ఆర్‌సీ15కు సంబంధించి మరో టైటిల్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. అదే.. ‘సి.ఇ.ఓ (CEO - చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్‌). ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి ఈ టైటిల్‌ అయితే అన్ని భాషల వారికి ఈజీగా కనెక్ట్‌ అవుతుందని మేకర్స్‌ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ టైటిల్‌ నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది. ట్విట్టర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉందీ టైటిల్‌. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న టైటిళ్లలో ‘సి.ఇ.ఓ’ కీలకంగా ఉందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. ప్రజలు, ప్రభుత్వం, పాలన, హక్కులు అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతోందని సమాచారం.

ఇందులో రామ్‌ చరణ్‌ సరసన కియారా అడ్వాణీ (Kiara Adwani) కథానాయికకగా నటిస్తున్నారు. ఎస్‌ జె సూర్య ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆస్కార్‌’ హడావిడిలో ఉన్నారు. ఈ నెల 12న జరగనున్న ‘ఆస్కార్‌’ వేడుక కోసం అమెరికాలో వెళ్లిన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-03-08T15:56:58+05:30 IST