సెన్సార్‌ పూర్తి.. రిలీజ్‌కు రెడీ!

ABN , First Publish Date - 2023-09-02T00:06:16+05:30 IST

యంగ్‌ టాలెంటెడ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి, అనుష్కా శెట్టి జంటగా నటించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం సెన్సార్‌ పూర్తయింది.....

సెన్సార్‌ పూర్తి.. రిలీజ్‌కు రెడీ!

యంగ్‌ టాలెంటెడ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి, అనుష్కా శెట్టి జంటగా నటించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం సెన్సార్‌ పూర్తయింది. సెన్సార్‌ సభ్యుల అభినందనలతో యుఏ సర్టిఫికెట్‌ పొందింది. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని మొదటి నుంచీ సినిమా టీమ్‌ చెబుతున్న మాటలు సెన్సార్‌ వారి అభినందనలతో నిజమయ్యాయని చెప్పవచ్చు. మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ నెల ఏడున తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఇప్పటివరకూ విడుదల చేసిన సినిమా టీజర్‌, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందనీ, అదే రెస్పాన్స్‌ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి దక్కుతుందని వారు తెలిపారు. ఈ చిత్రాన్ని ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసేందుకు హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రమోషన్‌ టూర్స్‌ చేస్తున్నారు.

14 భాషల్లో అనుష్క కొత్త చిత్రం

అనుష్క కొత్త సినిమాల విషయంలో గేర్‌ మార్చారు. తొలిసారి ఓ మలయాళ చిత్రం చేయబోతున్నారు. ‘కథనార్‌-ది వైల్డ్‌ సోర్సెరర్‌’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా విడుదలవుతోంది. తొలి భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. రోజిన్‌ థామస్‌ దర్శకుడు. హారర్‌ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం చిత్రబృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని ఒకేసారి 14 భాషల్లో విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ తెలిపింది.

Updated Date - 2023-09-02T00:06:16+05:30 IST