Hbd Chiranjeevi: చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువ!

ABN , First Publish Date - 2023-08-22T13:17:33+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.

Hbd Chiranjeevi: చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువ!

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘స్వయంకృషితో చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగారని చంద్రబాబు కొనియాడారు. సినీ పరిశ్రమ భవిష్యత్తు, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే ఆయన.. నిండు నూరేళ్లు ఆరోగ్య, ఆనందాలతో వర్థిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

చిరు తనయుడు రామ్‌చరణ్‌ మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాదు.. తన కూతురు క్లీంకారా తరఫున కూడా శుభాకాంక్షలు చెబుతున్నట్లు ట్వీట్‌ చేశారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు మా ప్రియమైప ‘చిరుత’ (చిరు తాత) అమితమైన ప్రేమతో’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు బాబాయ్‌ అంటే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. ‘‘ఎప్పటికీ నువ్వు నా జగదేకవీరుడివే! భవిష్యత్తు మరిన్ని బ్లాక్‌బస్టర్స్‌ మీ సొంతం కావాలని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

మా జగదేకవీరుడు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ వైజయంతీ సంస్థ ట్వీట్‌ చేసింది.

అలాగే ఎన్టీఆర్‌; అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, వెన్నెల కిశోర్‌, దర్శకుడు శ్రీను వైట్ల, గోపీచంద్‌ మలినేని, బాబీ, రత్నవేలు, వెంకీ కుడుముల, శ్రీవిష్ణు, మారతి, తమన్‌, సురేందర్‌రెడ్డి, అనిల్‌ సుంకర, బీవీఎస్‌ రవి, వక్కంతం వంశీ, తదితరులు చిరుకి శుభాకాంక్షలు తెలిపారు,

Updated Date - 2023-08-22T13:17:33+05:30 IST