Oscars To Naatu Naatu: విశ్వవేదికపై కదం తొక్కించారు.. ‘ఆర్ఆర్ఆర్’ టీంకి ప్రముఖుల ప్రశంసలు

ABN , First Publish Date - 2023-03-13T09:42:27+05:30 IST

అనుకున్నట్లుగానే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట సొంతమైంది. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, రచయిత చంద్రబోస్ కలసి స్టేజ్‌పై ఈ అవార్డుని అందుకున్నారు.

Oscars To Naatu Naatu: విశ్వవేదికపై కదం తొక్కించారు.. ‘ఆర్ఆర్ఆర్’ టీంకి ప్రముఖుల ప్రశంసలు
RRR

అనుకున్నట్లుగానే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట సొంతమైంది. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, రచయిత చంద్రబోస్ కలసి స్టేజ్‌పై ఈ అవార్డుని అందుకున్నారు. దీంతో భారతీయ సినీ లవర్స్‌కి, ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ చిత్రబృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎవరేమంటున్నారో చూద్దాం..

‘చరిత్ర సృష్టించారు.. నాటు నాటు ప్రభావం ఇప్పట్లో ప్రేక్షకులని వదలదు’ రవితేజ్ రాసుకొచ్చారు. అలాగే.. ‘విశ్వవేదికపై కదం తొక్కిన తెలుగు పాట ప్రపంచ యవనికపై నిలువెత్తు గర్వంతో నిలబడ్డ భారతీయత’ లిరిసిస్ట్ కల్యాణ చక్రవరి పేర్కొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం కీరవాణికి, రాజమౌళికి, చంద్రబోస్‌తో పాటు మిగిలిన మూవీ టీంకి విషెస్ తెలిపారు.

Updated Date - 2023-03-13T09:42:28+05:30 IST