Homage to Chandra Mohan : పరిచయం.. స్నేహం.. అనుబంధం!

ABN , First Publish Date - 2023-11-11T12:40:35+05:30 IST

సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

Homage to Chandra Mohan : పరిచయం.. స్నేహం.. అనుబంధం!


సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ (Chandramohan) మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రమోహన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. (Celebrities pay Homage to Chandra mohan)


‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి  చిత్రాల్లో తన వైవిధ్యమైన నటనా కౌశలం ద్వారా  తెలుగువారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్‌ నటులు, కథానాయకుడు చంద్రమోహన్‌ గారు ఇక లేరని తెలియడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి  శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని చిరంజీవి (Chiranjeevi) ట్వీట్‌లో పేర్కొన్నారు.

Chandra 3.jpg

‘‘ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్‌ పరమపదించారని తెలిసి ఎంతో విచారించా. నాటి చిత్రాలు మొదలు కొని నిన్న మొన్నటి చిత్రాల వరకూ నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’’


- మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

-కె రాఘవేంద్ర రావు (K Raghavendrarao)

చంద్ర మోహన్ గారు కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేది. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనను చూపించారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. 'షిర్డీ సాయిబాబా మహత్యం'లో నానావళిగా గుర్తుండిపోయే పాత్ర చేసారు, ఆయనతో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి.అన్నయ్య చిరంజీవి గారితో కలిసి చంటబ్బాయి, ఇంటిగుట్టు లాంటి చిత్రాల్లో నటించారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో మంచి పాత్ర పోషించారు. తమ్ముడు చిత్రంలో మా ఇద్దరి మధ్య అలరించే సన్నివేశాలుంటాయి.900కి పైగా చిత్రాల్లో నటించిన అయన  తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికి చేరువయ్యారు. చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. 

- పవన్ కళ్యాణ్ (Pawan kayan)

Chandramohan 1.jpg
‘‘విలక్షణ నటుడు చంద్రమోహన్‌ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు చిత్రాల్లో నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’


- నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Kalyan ram)

‘‘ఆయన మోము మనకు అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలతో ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వు విరుస్తుంది’’

  - సాయి ధరమ్‌ తేజ్‌ (Sai dharam tej)

Updated Date - 2023-11-11T15:03:07+05:30 IST