సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

DVV Danayya: వైభవంగా దానయ్య కుమారుడి పెళ్లి

ABN, First Publish Date - 2023-05-22T13:58:01+05:30

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన తనయుడు కల్యాణ్‌ ఓ ఇంటివాడయ్యాడు. వేదమంత్రా సాక్షిగా సమత మెడలో మూడు ముళ్లు వేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన తనయుడు కల్యాణ్‌ ఓ ఇంటివాడయ్యాడు. వేదమంత్రా సాక్షిగా సమత మెడలో మూడు ముళ్లు వేశాడు. కల్యాణ్‌ - సమతల వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌ నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హీరోలు పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ నీల్‌, తదితరులు ఈ వివాహ వేడుకకకు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

పెళ్లికొడుకు కల్యాణ్‌ ‘అధీరా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌ల సమక్షంలో గత ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దానయ్య ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో ‘ఓజీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-05-22T13:58:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!