Catherine Tresa: తెలుగులో మాట్లాడి షాకిచ్చిన బింబిసార భామామణి

ABN , First Publish Date - 2023-07-28T18:19:23+05:30 IST

కేథరిన్ ట్రెసా అనగానే 'సరైనోడు' సినిమాలో ఎంఎల్ఏ పాత్ర, 'నేను రాజు నేనే మంత్రి' సినిమాలో న్యూస్ యాంకర్ గా ఆమె చేసిన నటనకు ప్రసంశలు వచ్చి ఆమె మంచి నటిగా గుర్తింపు పొందింది. ఆ తరువాత చాలా సినిమాలు చేసింది అలాగే ఈమధ్య విడుదలైన హిట్ సినిమా 'వాల్తేరు వీరయ్య' లో రవితేజ పక్కన, దానికి ముందు ఇంకో హిట్ సినిమా 'బింబిసార' లో నందమూరి కళ్యాణ్ రామ్ పక్కన నటించి ఇప్పుడు ఒక థ్రిల్లర్ సినిమా చేస్తోంది

Catherine Tresa: తెలుగులో మాట్లాడి షాకిచ్చిన బింబిసార  భామామణి
Catherine Tresa

కేథరిన్ ట్రెసా (CatherineTresa) 'బింబిసార' (Bimbisara), 'వాల్తేర్ వీరయ్య' (WaltairVeerayya) సినిమాల విజయం తరువాత ఇంకో పెద్ద సినిమా చేస్తుంది అని అనుకుంటారు. అయితే కేథరిన్ కథకి ప్రాధాన్యం ఇచ్చి, అందులో తన పాత్ర చిన్నదైనా, పెద్దదైన దానికి ప్రాముఖ్యం ఉంటేనే చేస్తోంది. ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి చేస్తోంది కేథరిన్. 'ఓదెల రైల్వే స్టేషన్' (OdelaRailwayStation) అనే సినిమా ఆమధ్య ఓటిటిలో విడుదలైన అందరి ప్రసంశలు పొందింది. ఆ సినిమాకి దర్శకుడు అశోక్ తేజ (AshokTeja). ఇప్పుడు అదే అశోక్ తేజ ఒక థ్రిల్లర్ కథతో సినిమా చెయ్యాలని ప్లాన్ చేసాడు.

catherinetresa.jpg

అందులో ఒక ముఖ్య పాత్రలో కేథరిన్ ట్రెసా వేస్తోంది. ఈ సినిమాలో 'జార్జిరెడ్డి' (GeorgeReddy), 'వంగవీటి' (Vangaveeti) వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ (SandeepMadhav) కథానాయకుడిగా చేస్తున్నాడు. నిన్న గురువారం ఈ సినిమా అధికారికంగా ప్రారంభం అయింది. ఎందుకు ఈ చిన్న సినిమా చేస్తున్నారు అని కేథరిన్ ని అడిగితే, ఈ కథ తనకి ఎంతో నచ్చిందని, అందుకనే చేస్తున్నాని అని చెప్పింది. ఇది స్క్రీన్‌ప్లే బేస్‌డ్ సినిమా గా కూడా తయారవుతోంది అని అనింది. ఇందులో సందీప్ మాధవ్ పోలీస్‌ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు.

catherinetresa3.jpg

చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కేథరిన్ తెలుగులో చక్కగా మాట్లాడుతూ కనిపించడం. ఆమె డైలాగ్స్ అన్నీ ముందే ప్రిపేర్ అవుతానాని ఆ తరువాతీ షూటింగ్ వెళతానని చెప్తోంది. నిన్న ఈ సినిమా ప్రారంభోత్సవము జరిగినప్పుడు కూడా కేథరిన్ తన డైలాగ్స్ చెప్పడం కోసం దర్శకుడిని తన డైలాగ్ షీట్ అడిగి కారులోనే ప్రాక్టీస్ చేసింది. "నేను తెలుగు మాట్లాడగలను, అర్థం చేసుకోగలను," అని చెప్తోంది. ఇలా తెలుగులో మాట్లాడుతూ అక్కడి వాళ్లందరికీ షాకిచ్చింది కేథరిన్. అలాగే కేథరిన్ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపొయింది. ఇక్కడే సొంత ఇల్లు కూడా తనకి కావలసిన విధంగా డిజైన్ చేసుకొని కట్టించుకుంది అని తెలిసింది. ఇక తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టి మంచి సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నట్ట్టుగా చెపుతోంది.

Updated Date - 2023-07-28T18:19:23+05:30 IST