Virupaksha: సాయిధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్, మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్

ABN , First Publish Date - 2023-04-22T12:08:05+05:30 IST

'విరూపాక్ష' విడుదల అయింది, అందరూ బాగుంది అంటున్నారు, సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాతో వచ్చాయి. దర్శకుడు కార్తీక్ దండుకి ఇది మొదటి సినిమా అయినా, చాలా బాగా తీసాడు అని అంటున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ ఎలా వున్నాయంటే...

Virupaksha: సాయిధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్, మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన 'విరూపాక్ష' #Virupaksha సినిమా మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తో నడిచింది. ఈ సినిమా దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu), అలాగే నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ (BVSN Prasad) లు ఈ సినిమా మీద చాలా నమ్మకంగా వున్నారు, అందుకే ఈ సినిమా హిట్ అవుతుంది అని విడుదలకి ముందు నుంచీ చాలా గట్టిగా చెప్పారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ సాయి ధరమ్ తేజ్ #SaiDharamTej కెరీర్ లో బెస్ట్ అయ్యే విధంగా వచ్చాయి. ఇందులో సంయుక్త మీనన్ (Samyuktha Menon) కథానాయకురాలు కాగా, ఆమెకి మంచి పేరు వచ్చింది.

virupakshafromapril21.jpg

సాయి ధరమ్ తేజ్, యాక్సిడెంట్ నుండి కోలుకున్నాక చేసిన మొదటి సినిమా ఈ 'విరూపాక్ష' #Virupaksha. దీనికి కథనం అగ్ర దర్శకుడు సుకుమార్ (Sukumar) అందించటం విశేషం. ఈ సినిమా మార్నింగ్ షోస్ కి అంత లేకపోయినా, బాగుంది అన్న మాట మొత్తం పాకిపోయింది. ఇంక ప్రేక్షకులు మధ్యాహ్నం ఆట నుండి ఈ సినిమాని విరగబడి చూడటం మొదలెట్టారు.

మొదటి రోజు ఈ సినిమా రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టగా, డిస్ట్రిబ్యూషన్ షేర్ రూ 5.8 కోట్లు వసూల్ చేసింది అని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో హైయెస్ట్ మొదటి రోజు కలెక్షన్ (Best for SaiDharamTej) అని కూడా అంటున్నారు. అదీ కాకుండా ఈ శని ఆదివారాలు ఇంకా ఈ సినిమా బుకింగ్స్ బాగున్నాయి, మొదటి రోజు కన్నా ఈ రెండు రోజులు ఇంకా ఎఎక్కువ రెవిన్యూ వచ్చే అవకాశం కూడా వుంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

Virupaksha.jpg

ఈ సినిమా విడుదలకి ముందు రూ.25 కోట్ల బిజినెస్ చేసిందని, ఈ వారాంతం, అలాగే రానున్న మూడు నాలుగు రోజుల్లో ఇదే హవా కొనసాగితే తొందరగానే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని కూడా అంటున్నారు. 'విరూపాక్ష' సినిమా ఒక కొత్త జానర్ లో దర్శకుడు కార్తీక్ దండు తీసాడు. ఈ సినిమా క్షుద్రశక్తులు, అతీంద్రీయ శక్తులు, చేతబడి లాంటి వాటి మీద ఉంటుంది. దీనికి నేపధ్య సంగీతం, ఛాయాగ్రహణం ఎంతో ఉపకరించి ఈ సినిమాని మంచి హిట్ సినిమాగా తీర్చి దిద్దాయి. సాయి ధరమ్ తేజ్ నటన, అలాగే చివరి 20 నిముషాలు సంయుక్త మీనన్ నటన ప్రతిభతో సినిమా ప్రేక్షకులను కట్టి పడేసింది అని అందువల్ల ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు.

Updated Date - 2023-04-22T12:08:05+05:30 IST