సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విలన్‌ ఎవరో ఊహించలేరు

ABN, First Publish Date - 2023-06-01T00:26:57+05:30

‘స్వాతిముత్యం’తో తెరంగేట్రం చేశాడు బెల్లంకొండ గణేశ్‌. ఆ చిత్రం గణేశ్‌కి మంచి పేరు తీసుకొచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘స్వాతిముత్యం’తో తెరంగేట్రం చేశాడు బెల్లంకొండ గణేశ్‌. ఆ చిత్రం గణేశ్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ‘నేను స్టూడెంట్‌ సర్‌’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. రాఖీ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణేశ్‌ మాట్లాడుతూ ‘‘చాలా ఆసక్తికరమైన కథ ఇది. నిజ జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని పరిస్థితులు, సంఘటలను తెరపై కనిపిస్తాయి. పతాక సన్నివేశాల వరకూ విలన్‌ ఎవరో ఊహించలేరు. స్ర్కీన్‌ ప్లే అంత ఆసక్తికరంగా సాగుతుంది. ‘స్వాతి ముత్యం’లో నా పాత్ర మొదటి నుంచీ చివరి వరకూ అయోమయంగానే ఉంటుంది. ఈ సినిమాలో మాత్రం నా పాత్రలో పలు ఛాయలు ఉంటాయి. ఈ సినిమా నా కెరీర్‌కి చాలా ప్లస్‌ అవుతుందని భావిస్తున్నా. చాలామంది హీరోలు తమ కెరీర్‌ ప్రారంభంలో స్టూడెంట్‌ పాత్రలు పోషించారు. ఆ సినిమాలన్నీ ఆ హీరోల జీవితాల్ని మలుపు తిప్పాయి. ‘నేను స్టూడెంట్‌ సర్‌’ కూడా నాకు అలాంటి అవకాశం ఇస్తుందనుకొంటున్నా. ‘స్వాతిముత్యం’ రిజల్ట్‌ పట్ల సంతృప్తికరంగా ఉన్నా. ఆ సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే రిలీజ్‌ డేట్‌ విషయంలో తప్పు చేశాం. చిరంజీవి, నాగార్జున సినిమాల మధ్యలో తీసుకొచ్చాం. మరో డేట్‌ అయితే మంచి ఫలితం వచ్చేద’’న్నారు.

Updated Date - 2023-06-01T00:26:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!