RC16 - BuchiBabu: అలా అనుకుంటున్న వాళ్ల అంచనాలకు మించి...

ABN , First Publish Date - 2023-08-26T16:44:19+05:30 IST

రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కనున్న ‘ఆర్‌సీ16’ చిత్రంపై దర్శకుడు బుచ్చిబాబు సాన అప్‌డేట్‌ ఇచ్చారు. ‘ఉప్పెన’ చిత్రానికి నేషనల్‌ అవార్డ్‌ వచ్చిన సందర్భంగా దర్శకుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్‌సీ16’ చిత్రం గురించి అప్‌డేట్‌ ఇచ్చారు.

RC16 - BuchiBabu: అలా అనుకుంటున్న వాళ్ల అంచనాలకు మించి...

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కనున్న ‘ఆర్‌సీ16’ (RC16) చిత్రంపై దర్శకుడు బుచ్చిబాబు సాన (BuchiBabu Sana) అప్‌డేట్‌ ఇచ్చారు. స్ర్కిప్ట్‌ పనులు పూర్తి చేసుకుంది. ఇతర ప్రీ ప్రొడక్షన్‌ జరుగుతున్నాయి. డిసెంబర్‌, జనవరి మధ్యలో షూటింగ్‌ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు . ‘ఉప్పెన’ చిత్రానికి నేషనల్‌ అవార్డ్‌ వచ్చిన సందర్భంగా దర్శకుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్‌సీ16’ చిత్రం గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రం అందరి అంచనాలకు మించి ఉంటుందని తెలిపారు. ‘‘నేను రామ్‌ చరణ్‌తో తీయనున్న మూవీ సినిమా రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. కథ రాస్తున్న సమయంలో ఆయన సంగీతం అందిస్తే బాగుంటుందనిపించింది. ఆయన్ను కాంటాక్ట్‌ అయ్యి కథ చెప్పగానే ఓకే చేశారు. ‘ఇప్పటి వరకూ చాలా కథలు విన్నా కానీ, ఇలాంటిది వినలేదు. కచ్చితంగా మ్యూజిక్‌ చేస్తానను’ అన్నారు. అందరూ ఇది స్పోర్స్‌ డ్రామా అనుకుంటున్నారు. కానీ వాళ్లందరి అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది. నాలుగేళ్లగా ఈ కథ ఈ కథపై వర్క్‌ చేస్తున్నాను. షూటింగ్‌ జనవరిలో మొదలు పెట్టనున్నాం’’ అని చెప్పారు.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’లో (Game Changer) నటిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇందులో చరణ్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపిస్తారని టాక్‌. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె సూర్య, సునీల్‌, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-08-26T16:50:11+05:30 IST