Bro in OTT: ‘బ్రో’ ఓటీటీ రిలీజ్‌ ఎక్కడంటే!

ABN , First Publish Date - 2023-08-20T13:29:51+05:30 IST

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)- సాయిధరమ్‌ (Sai dharamtej) హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’ (Bro). ‘వినోదాయ సిత్తం’కు రీమేక్‌గా.. రూపొందిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. జీస్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం గత నెలలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

Bro in OTT: ‘బ్రో’ ఓటీటీ రిలీజ్‌ ఎక్కడంటే!

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)- సాయిధరమ్‌ (Sai dharamtej) హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’ (Bro). ‘వినోదాయ సిత్తం’కు రీమేక్‌గా.. రూపొందిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. జీస్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం గత నెలలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్‌(Netflix) వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది.

కథ:

ఇంటికి పెద్ద కొడుకైన మార్కండేయులు (సాయిధరమ్‌ తేజ్‌) తండ్రి మరణంతో ఇంటి బాధ్యతలు తన భుజాన వేసుకుంటాడు. ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు స్థిరపడాలని... ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని నిరంతరం శ్రమిస్తుంటాడు. ఓ రోజు ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదం మరణిస్తాడు. తనవాళ్లెవరూ జీవితంలో స్థిరపడలేదని, తాను చేయాల్సిన ఎన్నో పనులు మిగిలిపోయాయని తన జీవితానికి ఇంత తొందరగా ముగింపునివ్వడం అన్యాయమని టైమ్‌ (పవన్‌కల్యాణ్‌) అనే దేవుడి ముందు మొరపెట్టుకుంటాడు. దాంతో కాలం అనుగ్రహించి 90 రోజులు అతడి జీవితకాలాన్ని పెంచుతాడు. అలా మళ్లీ ఇంటికి చేరిన మార్క్‌ 90 రోజుల్లో అనుకున్నవన్నీ చేశాడా? అతడి వల్లే పనులన్నీ అయ్యాయా? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం రూపొందింది.

Updated Date - 2023-08-20T13:29:51+05:30 IST