Brahmanandam: క‌న్న‌ప్ప సెట్‌లో.. మోహ‌న్‌బాబు, శ‌ర‌త్‌కుమార్‌ల‌ను ఆడుకున్న బ్ర‌హ్మి

ABN , First Publish Date - 2023-12-02T18:17:53+05:30 IST

బ్ర‌హ్మానందం తాజాగా భ‌క్త క‌న్న‌ప్ప సెట్‌లోప్ర‌త్య‌క్ష‌మై మోహ‌న్‌బాబు, శ‌ర‌త్‌కుమార్‌ల‌తో త‌న శైలిలో ఓ ఆట‌ ఆడుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది.

Brahmanandam: క‌న్న‌ప్ప సెట్‌లో.. మోహ‌న్‌బాబు, శ‌ర‌త్‌కుమార్‌ల‌ను ఆడుకున్న బ్ర‌హ్మి
Brahmanandam

బ్ర‌హ్మానందం గురించి మ‌న‌మెవ‌ర‌మూ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. 40 ఏండ్లుగా సినిమాల‌తో న‌వ్విస్తూ వ‌చ్చిన ఆయ‌న ఇప్పుడు సినిమాలు త‌గ్గించుకున్న‌ప్ప‌టికీ ఎక్క‌డో ఓ దగ్గ‌ర క‌నిపించి అందరి మోములో న‌వ్వు తెప్పిస్తుంటారు. అయితే ఇప్పుడు సోష‌ల్‌ మీడియా వాడ‌కం రెట్టింప‌వ‌డంతో మీమ్స్ రూపంలో మ‌న ఇండ్ల‌లోకి వ‌చ్చేశారు. నిత్యం ఫోన్ల‌లో క‌నిపిస్తూ జీవితంలో ఓ భాగ‌మ‌య్యారు. అయితే బ్ర‌హ్మానందం తాజాగా భ‌క్త క‌న్న‌ప్ప సెట్‌లోప్ర‌త్య‌క్ష‌మై మోహ‌న్‌బాబు, శ‌ర‌త్‌కుమార్‌ల‌తో త‌న శైలిలో ఓ ఆట‌ ఆడుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

మోహ‌న్‌బాబును భ‌క్త‌వ‌త్స‌ల అంటూ సంభోదిస్తూ అక్క‌డి వారిని న‌వ్వించారు. మోహ‌న్‌బాబు ఓ వైపు మాట్లాడుతున్న బ్ర‌హ్మానందం ప‌ట్టించుకోకుండా పెద్ద వారితో మాట్లాడుతుంటే మ‌ధ్య‌లో వ‌స్తావెందుకు అంటూ ఆట‌ప‌ట్టించారు. శ‌ర‌త్‌కుమార్‌ను మీరు ఎక్క‌డి నుంచి వ‌చ్చారు, మీ వ‌య‌సెంత అంటూ కాసేపు న‌వ్వులు పూయించారు. ఇంకా అక్క‌డే ఉన్న‌ న‌టులు స‌ప్త‌గిరి, ర‌ఘుబాబు, ఐశ్వ‌ ర్య‌, సురేఖావాణిలతో క‌లిసి బ్ర‌హ్మానందం కాసేపు సంద‌డి చేశారు. మీరు ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.


మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప (Kannappa). ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి వారు ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ మూవీ స్థాయి అమాంతం పెరిగింది. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఆగ‌స్టులో శ్రీకాళహస్తిలోని గుడిలో లాంఛనంగా ప్రారంభించగా న్యూజిలాండ్‌ (New Zealand)లో శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న‌ది. మహాభారతం సీరియల్ తీసిన ముకేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం చేస్తుండ‌గా బుర్రా సాయి మాద‌వ్‌, ప‌రుచూరి గోపాల‌కృష్ణ ర‌చ‌న చేస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-12-02T18:46:27+05:30 IST