scorecardresearch

Bhola Shankar: హాస్య బ్రహ్మ డబ్బింగ్‌ పూర్తి!

ABN , First Publish Date - 2023-07-13T15:23:51+05:30 IST

చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయిన సంగతి తెలిసిందే! పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, కీర్తి సురేశ్‌ డబ్బింగ్‌ పూర్తి చేశారు. తాజాగా బ్రహ్మానందం డబ్బింగ్‌ పూర్తి చేశారు.

Bhola Shankar: హాస్య బ్రహ్మ డబ్బింగ్‌ పూర్తి!

చిరంజీవి(Chiranjeevi) హీరోగా మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) చిత్రం షూటింగ్‌ పూర్తయిన సంగతి తెలిసిందే! పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, కీర్తి సురేశ్‌ (Keerthi Suresh) డబ్బింగ్‌ పూర్తి చేశారు. తాజాగా బ్రహ్మానందం (Brahmanandam) డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్‌ రమేశ్‌ ట్విట్టర్‌ వేదికగా ఫొటోలు షేర్‌ చేసి చెప్పారు. ‘‘హాస్య బ్రహ్మ డబ్బింగ్‌ పనులు పూర్తి చేశారు. ఇందులో ఆయన అతిథిగా కీలక పాత్ర పోషించారు. థియేటర్‌లో ఆయన నవ్వులు పూయించడం ఖాయం’’ అని మెహర్‌ పేర్కొన్నారు.

ఇటీవల విడుదల చేసిన ‘జాం జాం జాం జజ్జనక’ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆ పాటను చిత్రీకరించిన తీరు, సెట్‌, చిరంజీవి డాన్స్‌ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాంబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా కథానాయికగా నటించిన ఈచిత్రంలో కీర్తి సురేశ్‌ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది.

Updated Date - 2023-07-13T15:29:17+05:30 IST