Brahmaji: కుక్కతో శోభనం మీరు ట్రై చెయ్యండి, ఆ రిపోర్టర్ ని ఆడుకున్న బ్రహ్మాజీ

ABN , First Publish Date - 2023-07-11T15:25:02+05:30 IST

ప్రతి ఫిలిం మీడియా సమావేశానికి తప్పనిసరిగా హాజరయి, తన తిక్క ప్రశ్నలతో అక్కడున్న వారందరినీ ఇబ్బంది పెడుతూ, దాని వలన తను యూట్యూబ్ లో వైరల్ కావాలని ప్రయత్నిస్తున్న ఒక రిపోర్టర్ కి బ్రహ్మాజీ షాకిచ్చాడు.

Brahmaji: కుక్కతో శోభనం మీరు ట్రై చెయ్యండి, ఆ రిపోర్టర్ ని ఆడుకున్న బ్రహ్మాజీ
Brahmaji at the promotional event of his film 'Slum Dog Husband'

‘స్లమ్ డాగ్ హజ్బెండ్' #SlumDogHusband సినిమా ప్రచారాలు మొదలెట్టారు. సంజయ్ రావు (SanjayRao), ప్రణవి మానుకొండ (PranaviManukonda) జంటగా నటించిన ఈ సినిమాని అప్పిరెడ్డి (Appireddy) నిర్మించారు. పూరి జగన్ (PuriJagannadh) దగ్గర పని చేసిన డాక్టర్ ఏఆర్ శ్రీధర్ (ARSreedhar) ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా ఈనెల 21 న ఈ సినిమా విడుదల అవుతుందని ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన విలక్షణ నటుడు సత్యదేవ్ (Satyadev) ప్రకటించాడు. సంజయ్ రావు తో పాటు, బ్రహ్మాజీ (Brahmaje), ఫిష్ వెంకట్, సప్తగిరి (Saptagiri), మురళీధర్ గౌడ్ (MuralidharGoud) ఇంకా చాలామంది ఈ సినిమాలో వున్నారు. ఇది ఒక కామెడీ సినిమాగా తెరకెక్కించారు. ఇందులో బేబీ అనే ఒక డాగ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది.

ట్రైలర్ లో చూపించినట్టుగా ఇందులో కథానాయకుడికి జాతకాల వలన ముందు ఒక కుక్కతో పెళ్లి చేస్తారు. ఆ తరువాత వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అతను, కానీ కుక్కకి అధికారికంగా విడాకులు ఇవ్వాలని, అలాగే భరణం కూడా ఇవ్వాలని ఆ కుక్కని పెంచుకున్న అతను కోర్టుకి వెళతాడు. ఇలా సాగుతుంది ఈ సినిమా కథ, దర్శకుడు శ్రీధర్ దీన్ని సరదాగా నేరేట్ చేసినట్టుగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

ఈ ప్రచారంలో భాగంగా నిన్న ఒక మీడియా సమావేశం కూడా పెట్టారు ఈ చిత్ర యూనిట్. ప్రతి ఫిలిం మీడియా సమావేశంలో ఏవో తిక్క ప్రశ్నలు అడిగి, యూట్యూబ్ లో వైరల్ అవుదామని ఈమధ్య అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు, ఒక జర్నలిస్ట్, అతను మరెవరో కాదు, సురేష్ కొండేటి (SureshKondeti). ప్రతి మీడియా సమావేశానికి తప్పకుండా హాజరయి, వేరే వాళ్ళకి మైక్ ఇవ్వకుండా, అన్ని ప్రశ్నలు, అందరిని తానే అడుగుతూ, ఎవరికీ అర్థం కానీ ప్రశ్నలు వేస్తూ కేవలం సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవ్వాలని చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటాడు.

media2.jpg

నిన్న అతను కూడా ఈ మీడియా సమావేశానికి వచ్చాడు. ప్రశ్నలు అడగమని చిత్ర యూనిట్ మీడియా వాళ్ళకి చెప్పగానే, మనవాడు అదే సురేష్ కొండేటి మైక్ తీసుకున్నాడు. వెంటనే నటుడు బ్రహ్మాజీ, సురేష్ కొండేటి ఏమి అడగాలనుకున్నాడో నేను చెప్తాను అని, 'హీరోకి కుక్కతో పెళ్లి అయింది కదా, మరి శోభనం కూడా కుక్కతో జరిగింది కదా? ఎలా జరిగింది? అని అడగాలని అనుకుంటున్నాడు సురేష్' అని చెప్పారు. వెంటనే సురేష్ ప్రశ్న సమాధానం కూడా మీరే చెప్పేయండి, అనగానే, "చాలా బాగుంది. మీరు కూడా కుక్కతో శోభనం ట్రై చేస్తే బాగుంటుంది' అని చెప్పాడు బ్రహ్మాజీ. అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సురేష్ కొండేటికి అయితే డబుల్ షాక్ తగిలింది. సాంఘీక మాధ్యమాల్లో సురేష్ కొండేటి మీద నెగటివ్ కామెంట్స్ వస్తున్నా, అతన్ని తిడుతున్న, పట్టించుకోకుండా, తన ధోరణి తనదే అన్నట్టుగా సురేష్ దూసుకుపోతున్నాడు. మీడియా సమావేశం అయ్యాక, బ్రహ్మాజీ, సురేష్ కొండేటి కలిసి మాట్లాడుకున్నారు. నవ్వుకున్నారు.

Updated Date - 2023-07-11T15:28:26+05:30 IST