Brahmaji : ఇక రిటైర్‌మెంట్‌ తీసుకుంటే మంచిదేమో!

ABN , First Publish Date - 2023-10-08T17:11:42+05:30 IST

నవీన్‌ పొలిశెట్టి తన నటన, కామెడీ టైమింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. తాజాగా బ్రహ్మాజీ ఆయన్ని ప్రశంసించారు. నవీన ప్రతిభ చూస్తుంటే తనకు భయమేస్తోందని పేర్కొన్నారు.

Brahmaji : ఇక రిటైర్‌మెంట్‌ తీసుకుంటే మంచిదేమో!

నవీన్‌ పొలిశెట్టి (Naveen polishetty) తన నటన, కామెడీ టైమింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. తాజాగా బ్రహ్మాజీ (brahmaji) ఆయన్ని ప్రశంసించారు. నవీన్‌ ప్రతిభ చూస్తుంటే తనకు భయమేస్తోందని పేర్కొన్నారు. ఇక తాను రిటైర్‌మెంట్‌ తీసుకోవడం మంచిదని సరదాగా ట్వీట్‌ చేశారు. తాను రిటైర్‌మెంట్‌ తీసుకోవడం బెటర్‌ అంటూ సరదాగా ట్వీట్‌ చేశారు.

తాజాగా నవీన్‌ పోలిశెట్టి నటించిన ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ఇంజినీరింగ్‌ గురించి ఈ సినిమాలో నవీన్‌ చెప్పే డైలాగ్‌ను.. ఇంజినీరింగ్‌ కష్టాలను ఉద్దేశించి గతంలో ఓ హిందీ సినిమాలో ఆయన చెప్పిన మరో డైలాగ్‌ను ఉపయోగించి ఓ నెటిజన్‌ వీడియో చేశాడు. ‘ఉత్తరాది లేదా దక్షిణాది.. ప్రాంతం ఏదైనా సరే నవీన్‌ పొలిశెట్టి ఇంజినీర్స్‌ వాయిస్‌’ అని ట్వీట్‌ చేశాడు. ఈ వీడియో చూసిన బ్రహ్మాజీ తాజాగా ట్వీట్‌ చేశారు. ఈ అబ్బాయి ప్రతిభ చూస్తుంటే నాకు భయమేస్తోంది. ఇన నేను రిటైర్‌మెంట్‌ తీసుకోవడం మంచిదేమో’’ అని ట్వీట్‌ చేశారు.

దీనికి నవీన ుమీకు పవర్‌ ఉంది. మాకు బ్రెయిన ఉంది. ఇద్దరం కలిస్తే..’ అనిసమాధానం ఇచ్చాడు. ుమాకు బ్రెయిన లేదా అని అర్థం వచ్చేలా ుఅంటే నాకు..’ అని బ్రహ్మాజీ ఆగిపోయారు. ప్రస్తుతం నెట్టింట వీరిద్దరి సంభాషణ నవ్వులు పూయిస్తోంది.

Updated Date - 2023-10-08T17:31:14+05:30 IST